కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిజర్వేషన్ల గురించి మాట్లాడిన వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే వీరిపై కేసు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితం ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ కు తరలించారు.
లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం పిల్లో కోరింది.
ఈ కేసులో ఢిల్లీలో హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ హాజరుకావడంపై ‘’తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, నాలుగు వారాల తర్వాత వస్తానని, అమిత్ షా ఫేక్ వీడియోకు, నాకు ఎలాంటి సంబంధంలేదని’’ వెల్లడించాడు.
ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీని భడే భాయ్ గా స్థుతించిన రేవంత్ రెండు రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నది.