‘’చాలా సంతోషంగా ఉంది. మొదట పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే… నన్ను తప్పుదారి నుంచి తప్పించి ఈ రోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నారు. తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడ్నే కాదు.రాష్ట్ర ప్రజలందరినీ తప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. మనం యువత 50 శాతం ఉన్నాం. యువతే రాష్ట్ర భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ద్వారా రాష్ట్రం మరింత ముందుకెళుతుందని, ఎంతో అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలందరూ కూటమికి తోడ్పాటు అందించాలి. కసిగా ఓటేసి వైసీపీ అరాచకాలకు అంతం పలకాలి’’ ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికలు ప్రజలకు ఒక సువర్ణావకాశం అని, ముఖ్యంగా వైజాగ్ ప్రజలు ట్రెండ్ సెట్ చేయాలి. ఎన్నికల్లో కూటమి గెలిస్తే విశాఖ ఒక మహానగరం అవుతుంది. బీజేపీ సహకారంతో ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా మనందరి భవిష్యత్తు నెంబర్ వన్ గా ఉండబోతోంది అని అంబటి అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను 7 నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించాను. అక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి. వైసీపీ వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు అనిపించింది. వైసీపీలో బానిసత్వం తప్ప ఏమీ లేదు. అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అంబటి రాయుడు అన్నాడు.
పవన్ కళ్యాణ్ ను నమ్మండి. నాకు ఆయనపై గట్టి నమ్మకం ఉంది. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను అంటూ అంబటి రాయుడు చెప్పడం గమనార్హం.