అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. వైసీపీ కీలక నాయకురాలు.. ఫైర్‌బ్రాండ్, జబర్దస్త్ రోజా కు సొంత నియోజకవర్గంలో పరాభవం ఎదురైంది. కనీసం ఆమెను చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆమె “మీకో నమస్కారం.. నచ్చిన వాళ్లను గెలిపించుకోండి“ అని ఈసడించుకున్నారు. నిజానికి ఆమెకు ఇక్కడ గెలిచే ఛాన్స్ లేదని.. ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. దీనికి కారణం.. సొంత పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు.. అదేవిధంగా రోజాను వ్యతిరేకిస్తున్న వర్గం.. చాపకింద నీరులా.. టీడీపీకి సానుకూలంగా ఉండడమే. ఇదే ఇప్పుడు రోజాకు ఇబ్బందిగా మారింది.
తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా.. గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. సుదూర ప్రాంతమైనా.. ఆమె కారులోనూ.. నడిచి కూడా వెళ్తున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే. 2019లో వెళ్లి ఓట్లు అడిగిన తర్వాత.. మళ్లీ ఆయా గ్రామాల్లో రోజా అడుగు కూడా పెట్టలేదు. దీంతో అలాంటి గ్రామాల్లో ప్రజలు రోజాపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఇదే పరిస్థితి ఆమెకు ఎదురైంది. పుత్తూరు మండలంలోని మారుమూల గ్రామాలకు ఆమె వెళ్లారు.
తనకు ఓటేయాలని కోరారు. కానీ, ఇక్కడి ప్రజలు ఆమెను కనీసం తమ ప్రాంతంలోకి అడుగు కూడా పెట్టుకుండా అడ్డుకున్నారు. గతంలో 2019లో కనిపించి.. తర్వాత.. ఏమయ్యారని ఆమెను నిలదీశారు. అంతేకాదు.. తమ సమస్యలపై ఎన్నడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. రోజా గోబ్యాక్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రోజా కొద్దిసేపు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. దీంతో వారిని ఉద్దేశించి.. “మీకో నమస్కారం.. నచ్చిన వాళ్లను గెలిపించుకోండి“ అని ఈసడించుకుని బయటకు వచ్చేశారు. అయితే.. ఈ పరిణామం రోజాకు షాకివ్వగా.. ఆమె వ్యతిరేక వర్గానికి మాత్రం.. సంతోషం కలిగించడం గమనార్హం.