జగన్ యాత్రలో దుర్ఘటన చోటు చేసుకుంది. జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు.
ఎడమ కంటిపైన ఒక సెంటీమీటరు వెడల్పుతో గాయమైంది. బస్సులోనే ఉన్న వైద్యుడు… జగన్ కి ప్రాథమిక చికిత్స చేసి బ్యాండేజ్ వేశారు.
ఈ దాడితో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అయితే దాడి అనంతరం కూడా జగన్ యాత్ర కొనసాగించడంతో పార్టీ కేడర్ ఊపిరి పీల్చుకుంది.
అయితే… ఈ దాడిపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. హై సెక్యూరిటీలో ఉన్న జగన్ పై కేవలం ఒకే ఒకరాయితో దాడి జరిగితే అది నేరుగా జగన్ కే తగలడం అనుమానాలు కలిగిస్తున్నాయి. అంత మంది జనం లో నుంచి సూటి గా తగిలేట్టు కొట్టడం సాధ్యమా ? అన్నది అనుమానాలకు ప్రధాన కారణం. పోనీ అది నిజమని అనుకుందాం అంటే… దెబ్బ తగిలాక ఇలాంటి హై సెక్యూరిటీ ఉండే వ్యక్తుల విషయంలో… ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, ఇది అనుకోకుండా జరిగిన ఘటన అన్నది తేలేవరకు భద్రతా దళాలు అనుమతి ఇవ్వవు. కానీ గాయంతో యాత్ర కొనసాగించాడు కచ్చితంగా ఇది మరో కోడి కత్తి డ్రామా అని తెలుగుదేశం శ్రేణులు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
Kodi Kathi Kamal Hassan is Back!#EndOfYCP#YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/X5zKHwDWuW
— Telugu Desam Party (@JaiTDP) April 13, 2024