ఒకే పార్టీ గొడుగు కింద ఎదిగిన ముగ్గురు లీడర్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ ఒకే పార్టీలో పనిచేసిన ఆ ముగ్గురు.. ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారారు. ఇందుకు తెలంగాణలోని వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక వేదికగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌ను కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో నిలిచారు. బీజేపీ తరపున అరూరి రమేశ్ సమరానికి సై అంటున్నారు. అయితే ఈ ముగ్గురు లీడర్లు కూడా కొన్ని రోజుల క్రితం వరకూ బీఆర్ఎస్లోనే కొనసాగడం గమనార్హం.
అరూరి రమేశ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ అదే పార్టీ తరపున పోటి చేసినా ఓటమి పాలయ్యారు. ఇటీవల బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ టికెట్ సాధించారు. ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య.. వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రచారం కూడా చేశారు. కానీ ఇంతలో తండ్రితో కలిసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు హస్తం పార్టీ తరపున పోటీలో నిలిచారు. ఇక మారేపల్లి సుధీర్‌కుమార్ 2001 నుంచి బీఆర్ఎస్లోనే ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదట వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేరునే కేసీఆర్ పరిశీలించారు. కానీ పోటీ చేయనని చెప్పిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా కావ్య.. కేసీఆర్‌కు షాకిచ్చి కాంగ్రెస్ నుంచి పోటీకి నిలబడ్డారు. దీంతో చివరకు సుధీర్‌కుమార్‌కు అవకాశం దక్కింది. ఈ సిటింగ్ ఎంపీ స్థానాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుండగా.. ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయి.