పదేళ్ల పాటు తెలంగాణకు రేవంత్ రెడ్డే సీఎం.. ఈ మాట ఇంకెవరైనా అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మాత్రం ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో అసమ్మతి వర్గంలో ఒకరిగా ఉంటున్నారు కోమటిరెడ్డి. తాను సీఎం పదవికి గట్టి పోటీదారునని భావించే కోమటిరెడ్
రేవంత్‌ను సీఎం క్యాండిడేట్‌గా పరిగణిస్తున్న టైంలోనూ తనకేం తక్కువ అన్నట్లే మాట్లాడారు. ఐతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి తనకు మంత్రి పదవి దక్కాక ఆయన రేవంత్‌తో సర్దుకుపోతున్నట్లే కనిపిస్తోంది. ఆ మధ్య కూడా ఒక మీటింగ్‌లో రేవంత్ మీద ప్రశంసలు కురిపిస్తూ.. సీఎంను విమర్శించిన వాళ్ల మీద విరుచుకుపడ్డారు.
ఓవైపు కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలను తట్టుకుని రేవంత్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగగలరా అన్న ప్రశ్నలు రేకెత్తుతుంటే.. అసమ్మతి వర్గాన్ని పెంచి పోషిస్తాడని అంచనాలున్న కోమటిరెడ్డి మాత్రం రేవంత్ పదేళ్ల పాటు సీఎంగా ఉంటారని తేల్చేశారు. నల్గొండలో గురువారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని.. అంతేకాక ఈ పదేళ్లూ రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్‌లో ఏకనాథ్ షిండేలు లేరన్నారు. అలాగే తమ పార్టీలో గ్రూపులు లేవని.. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందని.. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నా తాను దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.