సంక్షేమానికి, సంక్షేమ పథకాలకు పేటెంట్ హక్కు తమదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాంగ పఠనం అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ.. సాధికారత దిశగా ఈ ఏడాది రాష్ట్రంలో అడుగులు పడాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గడంతోపాటు.. ప్రజల సాధికారత ఈ ఏడాది లక్ష్యాలుగా పేర్కొన్నారు. సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తామన్నారు.
సంక్షేమం అనేది టీడీపీ ప్రభుత్వంతోనే ప్రారంభమైందని చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టించేందు కు.. ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ సంపాదనను సంక్షేమానికి కేటాయిస్తామన్నారు. ప్రజలు కూడా పొదుపు గా జీవించాలని సూచించారు. సంపాదనలో తెలుగు వారికి మించిన వారు లేరన్నారు. ఉపాధి కల్పనలో నూ తెలుగు వారు ఎవరికీ తీసుపోరని అన్నారు. సేవాభావాన్ని పెంచుకోవాలన్నారు. తమ పాలనలో 100 రకాల కార్యక్రమాలు చేశామన్నారు.
సంక్షేమం ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నట్టు చెబుతున్నారని. కానీ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే సంక్షేమానికి తాను పెద్ద పీట వేశానన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేయడం అప్పట్లోనే ప్రారంభిం చామన్నారు. నదుల అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మేలు చేయొచ్చని పదేళ్ల కిందటనే చెప్పామన్నారు. పట్టిసీమ ద్వారా.. రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. కియా సహా అనే పరిశ్రమలు తీసుకువచ్చామన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అన్నీ చేసి పెట్టినా.. కనీసం అభివృద్ధి చేయకపోగా.. సహజ వనరులను దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని గంజాయి, జే బ్రాండ్, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని చంద్రబాబు అన్నారు. హత్యారాజకీయాలు జరుగుతున్నాయనే విషయాన్ని తాను చెప్పడమే కాదని.. ఆ కుటుంబంలోని వారే చెబుతున్నారని అన్నా రు. తెలుగు జాతికి పూర్వవైభవం రావాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. నూత న ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం ముందుకు పోయే పరిస్థితి రావాలన్నారు. ఇది అసాధ్యం కాదన్నారు. పంచాంగం ఒక స్ఫూర్తి ఇస్తుందని.. దీనిని ముందుకు తీసుకువెళ్లి.. చైతన్యం పరచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.