పాలకొల్లు ప్రజాగళం సభలో, చంద్రబాబు గారి సమక్షంలో, టిడిపిలో చేరిన ఎంపీ రఘురామకృష్ణంరాజు #PrajaGalamForDemocracy #PrajaGalam #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/RboR59TfPQ
— Telugu Desam Party (@JaiTDP) April 5, 2024
వైసీపీ రెబల్ ఎంపీ, నరసాపురం సిట్టింగ్ నాయకుడు కనుమూరి రఘురామ కృష్ణరాజు తాజాగా టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. రఘురామకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. అనంతరం.. చంద్రబాబు మాట్లాడుతూ, ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నేత రఘురామ అని పేర్కొన్నారు. ప్రజలందరి ఆమోదంతో ఆయనను ఇవాళ పాలకొల్లు సభ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నామన్నారు.
“మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేశాడు దుర్మార్గుడు. ఇది ఆమోదయోగ్యమా? ఏమిటీ అరాచక పాలన? ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు రాత్రంతా నేను మేలుకునే ఉన్నాను. భారత రాష్ట్రపతికి, గవర్నర్ కు విన్నవించాం. కోర్టులో అన్ని విధాలా ప్రయత్నాలు చేశాం. చివరికి కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆయన బయటపడ్డాడు. లేకపోతే ఇవాళ మీరు రఘురామకృష్ణరాజును చూసేవారు కాదు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఒక దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇలాంటి వ్యక్తులను కూడా కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. అందుకే రఘురామను మనస్ఫూర్తిగా టీడీపీలో చేర్చకుంటున్నామని తెలిపారు. అయితే.. సభలోనే రఘురామకు టికెట్ ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు ఆయనను పార్టీలోకి చేర్చుకోవడంతోనే సరిపుచ్చారు.
అయితే.. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. రఘురామకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. దీనిపైనా రెండు చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఉండి నియోజకవర్గం లేకపోతే ఇదే జిల్లాలోని ఉంగుటూరు స్థానాన్ని రఘురామకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి కూటమి తరఫున రఘురామ తన కోరికను తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది.
పాలకొల్లు పులకరించింది #PrajaGalamForDemocracy #PrajaGalam #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/1IpweTJYf0
— Telugu Desam Party (@JaiTDP) April 5, 2024