సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చిన్నాన్న, మాజీ మంత్రి.. వివేకానంద రెడ్డిని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకుని.. నంగనాచి కబుర్లు చెబుతున్నాడని విమర్శించారు. వివేకా ను దారుణంగా చంపిన వ్యక్తికే మళ్లీ కడప పార్లమెంటు సీటు ఇచ్చాడని వ్యాఖ్యానించారు. “బాబాయ్ ది గొడ్డలివేటా? లేక సహజమరణమా? చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి మళ్లీ ఊరేగుతున్నారు. ఈయన చెల్లెలు ఇప్పుడు ఎలుగెత్తుతోంది. మా నాన్నను చంపిన వాళ్లపై కేసులు పెట్టండి, ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయండి, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించండి అని అడిగితే, ఆడబిడ్డపై కేసులు పెట్టే స్థాయికి వచ్చారు“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Melcowe to Yeduguri Sandinti family tree ???????? pic.twitter.com/8BfgBZshRI
— Venu M Popuri (@Venu4TDP) March 29, 2024
వైసీపీ ఇచ్చిన ఇళ్లు రద్దు చేయను!
వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తే మనందరం బాగుపడతామని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల వచ్చే సరికి కొత్త వేషం వేసుకుని వచ్చాడని అన్నారు. “మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేవాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ఆ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. అందులోంచి దిగకుండానే మేము సిద్ధం అంటున్నాడు“ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఇప్పటివరకు పేదలకు ఇచ్చిన ఇంటి కాలనీలు రద్దు చేయబోమని చంద్రబాబు చెప్పారు. ఇంకా డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తానన్నారు.
సీఎం జగన్పై ప్రశ్నల వర్షం!
ఇదేసమయంలో సీఎం జగన్పై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
+ పేదల కోసం రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినవాళ్లు పెత్తందార్లా? లేక, అధికార దాహంతో అన్న క్యాంటీన్లను రద్దు చేసినవాళ్లు పెత్లందార్లా?
+ తెలుగు ప్రజల పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా డబ్బులు ఇచ్చాను. మేం పెత్తందారులమా? లేక విదేశీ విద్య పథకం నిలిపివేసినవాళ్లు పెత్తందార్లా?
+ ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలని భావించి.. రాష్ట్రంలో 12 లక్షల టిడ్కో ఇళ్లు తీసుకువస్తే, ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా రంగులు వేసుకుని పెత్తనం చేసేవాళ్లు మీరు పెత్తందార్లు కాదా?
+ మేం ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కానీ ఇతడు రూ.500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన పెత్తందారా? మేం పెత్తందార్లమా?
+ ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం… వాటిని రద్దు చేశాడు. ఆ పథకాలు ఇచ్చిన మేం పెత్తందారులమా? ఆ 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా?
+ పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం… ఇప్పుడీ ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేశారు. మేం పెత్తందారులమా? ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసిన జగన్ పెత్తందారుడా?
ఏపీ పరిస్థితిపై..
ప్రస్తుతం ఈ ఐదేళ్ల వైసీపీ పాలన అనంతరం ఏపీ ఎలా ఉందో చంద్రబాబు చెప్పారు.
+ దేశంలో తలసరి అప్పుల్లో ఏపీ నెంబర్ వన్
+ ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్
+ మహిళలపై దాడుల్లో ఏపీ నెంబర్ వన్
+ ప్రజల ఆస్తుల దోపిడీలో ఏపీ నెంబర్ వన్
+ శాంతి భద్రతలు లేకుండా పోయిన రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్
+ పన్నుల పిండుడులో ఏపీ నెంబర్ వన్