జగన్-చంద్రబాబుల విషయం రాజకీయాల్లో కొత్తకాదు. పరస్పరం విమర్శించుకోవడం పాతపాటే. కానీ, ఇప్పుడు గతానికి భిన్నం గా టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చిపోయారు. వినూత్న రీతిలో జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. చండ్ర నిప్పులు కురిపించారు.
ఇటీవల కాలంలో వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రతి ప్రశ్నకు చంద్రబాబు సమాధానంతో విరుచుకుపడ్డారు.
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ఈ నెల 8 నుంచి ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కారుపై భిన్నమైన కోణంలో విమర్శలు చేస్తూ.. ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుండడం గమనార్హం.
ప్రతి ప్రశ్నకు సమాధానం
వైసీపీ నాయకులు ఇటీవల కాలంలో చంద్రబాబును ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రశ్నలకు తాజాగా చంద్రబాబు ఆన్సర్ ఇచ్చేశారు. పనబాక లక్ష్మి నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారని, వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవం లేదని అన్నారు. ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని కష్టపడి పనిచేశానని, బడుగు బలహీన వర్గాల కోసం పనబాక పనిచేశారని చంద్రబాబు వివరించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రశ్న-1
బీసీలకు చంద్రబాబు ఏం చేశారంటూ.. మంత్రి అనిల్ ఇటీవల ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.. ‘‘బీసీలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత టీడీపీది. జగన్ వచ్చాక రిజర్వేషన్లను 25శాతానికి తగ్గించాడు. బీసీలంటే సీఎం జగన్‌కు కోపం, ద్వేషం. నేను ఆదరణ పథకం పెట్టా.. జగన్ ఒక్క పనిముట్టు ఇవ్వలేదు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీసీ అయిన సుధాకర్‌ను నియమించాం. వర్సిటీల వీసీలుగా జగన్‌కు ఇష్టమైన వారిని నియమించుకున్నాడు. జగన్‌రెడ్డి జమానాలో బీసీల ప్రాధాన్యత నేతి బీరకాయ చందమే. బీసీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదు. నవరత్నాలు కాదు.. నవమోసాలు చేశారు“ అని విరుచుకుపడ్డారు.
ప్రశ్న-2
ఎస్సీలను చంద్రబాబు మాయ చేశారంటూ.. కారెం శివాజీ(గతంలో టీడీపీకి అనుకూలం.. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు) అడిగిన ప్రశ్నకు.. తాజాగా బాబుఏమన్నారంటే.. “షెడ్యూల్డ్ కులాలకు వైసీపీ పాలకులు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?. ఎస్సీలకు విదేశీ విద్య, ఇన్నోవా కార్లు మా పాలనలో అందించాం. వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది గోరంత.. దోచింది కొండత. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం లేదు.. బీసీ సబ్‌ప్లాన్ లేదు. వారికి ఉన్న కార్పొరేషన్లను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు“ అని దుయ్యబట్టారు.
ప్రశ్న-3
బెల్ట్ షాపుల పాపం చంద్రబాబుదేనని.. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. దీనికి బాబు ఏమన్నారంటే.. వైసీపీ పాలనలో మద్యపాన నిషేధం అనేది పచ్చి మోసమన్నారు. లాక్డౌన్లో కూడా బ్రాందీషాపులు తెరుస్తారా? అని బాబు వ్యాఖ్యానించారు. చదువు చెప్పే టీచర్లను సారాకొట్ల దగ్గర కాపాలా పెడతారా? అని మండిపడ్డారు. తమ పాలనలో బెల్ట్ షాపులను నిషేధించేందుకు కేసులు ముమ్మరంగా నమోదు చేసినట్టు తెలిపారు. అంతేకాదు, నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటావా?. స్పెషల్ స్టేటస్ తేలేరు. కాబట్టి.. ఆ పేరుతో మద్యం బ్రాండ్ తెచ్చారు. రాష్ట్రం నష్టపోతోంది.. ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. అని దుయ్యబట్టారు.
ప్రశ్న-4
ఇసుక విధానంలో గొప్ప మార్పు మేం తెచ్చాం.. నాడు ఉచిత ఇసుక వల్ల బాబు బాగుపడ్డారు.. అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై బాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. ‘‘టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఇప్పుడు ఇసుక మాత్రం చెన్నై, బెంగళూరులో దొరుకుతోంది. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఇసుకలేని కారణంగా రియల్ వ్యాపారం పోయి.. రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా చేయాలనుకున్నాం. రెండేళ్లలో ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా?. పోలవరం పనులు 75శాతం పూర్తి చేశాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సవాల్!!
ఈ జగన్‌రెడ్డి వల్ల పెట్రోల్ ధర సెంచరీ కొట్టిందని, పేదల జేబులు గుల్ల చేసిన పెద్దమనిషి జగన్‌రెడ్డి అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ, వైసీపీ పాలనపై చర్చించడానికి ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలా అయితే.. తాను చర్చకు సిద్ధమని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తిరుపతి ఉప పోరులో బాబు వైఖరి చాలా భిన్నంగా ఉండడం గమనార్హం.
Read Also
- జగన్‌ను విజయమ్మ ఇట్టా ఇరికించేశారేంటి ?
- అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
- టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
- Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది !
- ఇంత అందాన్ని ఎలా మిస్సయ్యాం ఇంతకాలం
- లావణ్యను ఇంత సెక్సీగా ఎపుడైనా చూశారా ?
- Hot poses: హంస నడక నందిని
- Photos: తెలుగు బ్యూటి అంజలి
- pic of the day : బికినీలో తెల్లతోలు పిల్ల
- Photos: పాప పటాసు – గుండె మటాషు
- Malavika Mohanan: పాపకు కరెక్టుగా అక్కడుంది పుట్టుమచ్చ