వైఎస్. విజయలక్ష్మి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి భార్య. వైఎస్ జీవించి ఉన్నంత కాలం పొలిటికల్ తెరపై ఆమె ఎప్పుడూ కనిపించలేదు. వైఎస్ మరణాంతరం ఆమె బయటకు రాక తప్పలేదు. నాడు కాంగ్రెస్ పార్టీ పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా విజయలక్ష్మిని ఎమ్మెల్యేను చేసింది. జగన్‌తో పాటు ఆమె కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పెట్టగానే పులివెందుల ఉప ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి సొంత మరిది వివేకాపైనే భారీ మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో జగన్ కోసం పులివెందుల సీటు వదులుకున్న ఆమె వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ ఫ్యామిలీ చరిత్రలోనే ఇది తొలి ఓటమిగా నిలిచింది. ఆ తర్వాత వివేకా కడప జిల్లాలో ఎమ్మెల్సీగా ఓడిపోయారు.
ఇక ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఆమె గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్నారు. అంతెందుకు ఓ వారం క్రితమే ఏబీఎన్ ఆర్కే తమ కుటుంబంపై రాసిన రాతలకు కౌంటర్‌గా ఆమె ఓ లేఖ కూడా రాశారు. అయితే ఇంతలోనే ఆమె ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉండి.. తెలంగాణలో పార్టీ పెడుతోన్న షర్మిల సంకల్ప సభకు హాజరయ్యారు. ఇది వైసీపీలోనే కాకుండా.. తెలుగు రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయ్యింది. పైగా విజయలక్ష్మి తన బిడ్డ షర్మిలను ఆశీర్వదించాలని కోరారు.
ఓ వైపు షర్మిల కొత్త పార్టీపై జగన్‌తో పాటు వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఇటు జగన్ మీడియాలో షర్మిల వార్తలకు ఏ మాత్రం కవరేజ్ ఉండడం లేదు. పైగా సజ్జల ఓపెన్‌గానే షర్మిలకు కొత్త పార్టీ వద్దని చెప్పామని.. అయినా ఆమె వినలేదని చెప్పారు. ఇక్కడే అభిప్రాయ బేధాలు స్పష్టంగా తెలిసి పోతున్నాయి. ఇక విజయలక్ష్మి ఇటు కొడుకు పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ అటు కూతురు పెడుతోన్న కొత్త పార్టీ సభకు హాజరు కావడం వైసీపీలోనే పెద్ద గందరగోళానికి కారణమైంది.
తల్లికి కూడా జగన్‌తో గ్యాప్ ఉందా ? అన్న కొత్త సందేహాలు రావడం సహజం. దీనికి తోడు వివేకా హత్య ఉదంతం ఇప్పుడు రగులుతోంది. ఈ సమయంలోనే ఫ్యామిలీకి జగన్ దూరంగా ఉన్నట్టు సంకేతాలు రావడం సహజంగానే అనేక సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో విజయలక్ష్మి న్యూట్రల్‌గా ఉండకుండా షర్మిలకు సపోర్ట్ చేయడంతో జగన్ ఇరకాటంలో పడినట్టే అయ్యింది.
Read Also
- జగన్ పాలనలో మందుబాబులకు `స్పెషల్ స్టేటస్`.. నిప్పులు చెరిగిన చంద్రన్న
- అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
- టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
- Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది !
- ఇంత అందాన్ని ఎలా మిస్సయ్యాం ఇంతకాలం
- లావణ్యను ఇంత సెక్సీగా ఎపుడైనా చూశారా ?
- Hot poses: హంస నడక నందిని
- Photos: తెలుగు బ్యూటి అంజలి
- pic of the day : బికినీలో తెల్లతోలు పిల్ల
- Photos: పాప పటాసు – గుండె మటాషు
- Malavika Mohanan: పాపకు కరెక్టుగా అక్కడుంది పుట్టుమచ్చ