దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. క్రమక్రమంగా ఏపీ, తెలంగాణలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సచివాలయంలో కరోనా కలకలం ఉద్యోగులను కలవరపెడుతోంది. చాలామంది సచివాలయ ఉద్యోగులు కొవిడ్ బారిన పడడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు సెలవులు పెట్టుకుని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
సచివాలయంలోని మున్సిపల్, పరిశ్రమలు, మైనింగ్శాఖల్లో 9 మంది ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో సగం మందికి పైగా వారాంతాల్లో హైదరాబాద్ వెళ్లి వస్తుండడంతోనే ఏపీ సచివాలయంలో కేసులు పెరిగాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో సచివాలయంలో వారానికి రెండు రోజులు ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేవారని, ఇపుడు చేయకపోవడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.
ఉద్యోగులు ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకోవడంతో ఏ ఉద్యోగి కరోనా బారిన పడ్డారన్న సంగతిపై క్లారిటీ లేదంటున్నారు. సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోవిడ్ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న టాక్ వస్తోంది.
ముఖ్యంగా సందర్శకులు లోపలికి వచ్చాక నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక, కొందరు వ్యాక్సిన్ తీసుకున్నాం కదా…ఏమీ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారట. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 45 ఏళ్ల లోపువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Also
- జగన్ను విజయమ్మ ఇట్టా ఇరికించేశారేంటి ?
- జగన్ పాలనలో మందుబాబులకు `స్పెషల్ స్టేటస్`.. నిప్పులు చెరిగిన చంద్రన్న
- అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
- టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
- Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది !
- ఇంత అందాన్ని ఎలా మిస్సయ్యాం ఇంతకాలం
- లావణ్యను ఇంత సెక్సీగా ఎపుడైనా చూశారా ?
- Hot poses: హంస నడక నందిని
- Photos: తెలుగు బ్యూటి అంజలి
- pic of the day : బికినీలో తెల్లతోలు పిల్ల
- Photos: పాప పటాసు – గుండె మటాషు
- Malavika Mohanan: పాపకు కరెక్టుగా అక్కడుంది పుట్టుమచ్చ