ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల జాబితాలపై వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆల్రెడీ తొలి విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించింది. ఇక, బీజేపీ-టిడిపి-జనసేనలు పొత్తు పెట్టుకున్న తర్వాత విడుదల కాబోతున్న రెండో జాబితాపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే 34 మంది అభ్యర్థుల రెండో జాబితాను ప్రజల ముందుకు తీసుకువచ్చామని ఆయన అన్నారు.
అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు కోరారు.
తొలి విడతలో ప్రకటించిన 94 మందికి అదనంగా మరో 34 మంది పేర్లను చంద్రబాబు ప్రకటించారు. దీంతో టీడీపీ తరఫున బరిలో దిగబోయే అభ్యర్థుల జాబితా 144 మందిలో 128 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్లయింది. మరో 16 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు…రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గురజాల నుంచి యరపతినేని శ్రీనివాస్‌కు టికెట్ కన్ఫమ్ అయింది. ఆత్మకూరు నుంచి మాజీ వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది.
రెండో విడత అభ్యర్థుల జాబితా:
నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి
గాజువాక – పల్లా శ్రీనివాసరావు
చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
మాడుగుల – పైలా ప్రసాద్
ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం – మిర్యాల శిరీష
కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు – అశోక్ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి – కరుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు – వరదారాజుల రెడ్డి
నందికొట్కూరు – గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్