ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ సభ ఊరేగింపు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 7:00 గంటలకు తిరుపతి ఆవిర్భావ సభ ఊరేగింపు శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం దగ్గర జి-కార్ల వీధి, ప్రారంభమై కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కళ్ళా మండపం ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ముగుస్తుంది.
ఈ తిరుపతి ఆవిర్భావ సభ ఊరేగింపు వేడుకలను ప్రతి సంవత్సరం టీటీడీ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ క్రింది విధంగా ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ దిగ్బంధాలు ఉంటాయి. శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు సహకరించవలసిందని పోలీసులు కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:-
1. టౌన్ క్లబ్ సిగ్నల్ దగ్గర గాంధీ రోడ్డు వైపుగా వాహనాలు వెళ్లకుండా బాలాజీ కాలనీ, అలిపిరి వైపు దారి మళ్లింపు చేయబడును.
2. మునిషిపల్ ఆఫీస్ సెంట్రల్ పార్క్ సిగ్నల్ దగ్గర నాలుగు కాళ్ల మండపం వైపు వాహనాలు వెళ్ళకుండా ఇందిరా మైదానం, తుడా రోడ్డు వైపు దారి మళ్లింపు చేయబడును.
3. ఆర్.సి.రోడ్డు అండర్ బ్రిడ్జ్ వైపు వాహనాలు వెళ్లకుండా అన్నమయ్య కూడలి వద్దనే దారి మళ్లింపు చేయబడును.
4. రైల్వే స్టేషన్ ప్రీపెయిడ్ టాక్సీ కౌంటర్ దగ్గర కర్నాల వీధికి వాహనాలు రాకుండా విష్ణు నివాసం వైపు దారి మళ్లింపు చేయబడును.
ట్రాఫిక్ కట్ ఆఫ్ పాయింట్స్ (ట్రాఫిక్ దిగ్బంధం) వివరాలు:-
1. కృష్ణాపురం ఠానా దగ్గర ప్రకాశం రోడ్డు, చిన్న బజారు వీధి నుండి గాంధీ రోడ్డు లోకి వాహనాలు అనుమతి లేదు
2. నాలుగు కాళ్ల మండపం కూడలి దగ్గర తిలక్ రోడ్డు నుండి బండ్ల వీధి నుండి వచ్చేదారులు మూసి వేయబడును.
3. ఆంజనేయస్వామి గుడి పక్కన ఉన్న తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు రోడ్డు నుండి జీ-కార్ల వీధిలోకి వాహనాలు రాకుండా మూసి వేయబడును.
4. బీమాస్ డీలక్స్ పక్కనున్న రోడ్డు నుండి జీ-కార్ల వీధిలోకి వాహనాలు రాకుండా మూసి వేయబడును.
5. రైల్వే స్టేషన్ రోడ్డు మూసి వేయబడును.(కర్నాల వీధిలోకి వాహనాలు రాకుండా).
6. ఆర్.సి. రోడ్డు అండర్ బ్రిడ్జి ఇరువైపులా మూసి వేయబడును.