పవన్ సినిమా బెనిఫిట్ షో రద్దు చేసినందుకు పవన్ అభిమానులు రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అది అక్కడితో ఆగడం లేదు. ఇది ప్రభుత్వానికి పవన్ అభిమానులకు మధ్య గొడవలా మారింది. ఈ గొడవలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఏపీలో వకీల్ సాబ్ చుట్టూ అల్లుకున్న వివాదం తెలుగు రాష్ట్రాల్లో భారీ సంచలనం సృష్టిస్తోంది. ప్రతి సినిమాకు ధరలు పెంచినట్టే ఈ సినిమా టిక్కట్ల ధరలు పెంచారు. అదనపు షోలను ఆపేసి ఇప్పటికే వకీల్ సాబ్ కు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిన జగన్ అప్పటికీ ఊరుకోక గవర్నమెంటు డబ్బులతో ఆ సినిమాపై పోరాటం మొదలుపెట్టారు.
టికెట్ ధరను 3 రోజులు పెంచడానికి హైకోర్టు అనుమతితో పెంచినా కూడా జగన్ సర్కారుకు మింగుడపలేదు. దీంతో ఆ తీర్పుపై సవాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. టికెట్ ధరలకు అనుకూలంగా ఉన్న కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
నిజానికి ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి, కోవిడ్ సమస్య ప్రజలను వేధిస్తోంది. ఆ పనులు మానుకుని ఈ సినిమా విషయమై ప్రభుత్వం కోర్టుకు పోవడాన్ని అందరూ అసహ్యించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి (ఈమె జగన్ కేసులో ఏ9) ని గెలిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికార పార్టీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, పవన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ప్రజల ధనంతో కోర్టుల్లో డబ్బులు వేస్టు చేస్తోంది.
పవన్ కొత్త సినిమాకు అడ్డంకులు కలిగించడం ద్వారా వారిని చికాకుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదో చిల్లర పనిగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. సామాన్యులు జగన్ చేస్తున్న పని పట్ల ఏవగింపు కలిగి ఉన్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను జగన్ లాక్కున్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకున్న జగన్ ఇతరులు విమర్శించినా తట్టుకోలేకపోతున్నారు. తాజా పిటిషన్‌కు సంబంధించి కోర్టు ఏమి నిర్ణయిస్తుందో మనం చూడాలి.
https://twitter.com/yskanth/status/1380776843389771779