“నన్ను ఆనాడు ఎగతాళి చేశారు. కానీ, ఇప్పుడు వారే.. మెచ్చుకుంటున్నారు“ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ రంగానికి ఏపీకి(ఉమ్మడి) పరిచయం చేసినప్పుడు.. తనను ఎగతాళి చేశారని.. అయినా పట్టుదలతో ముందుకు సాగానని ఆయన చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు కొన్ని వేల మంది జీవితాలను మలుపు తిప్పిందని.. హైదరాబాద్, సైబరాబాద్ వంటి నగరాల ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చేసిందని వ్యాఖ్యానించారు.
తాజాగా బెంగళూరులో పర్యటించిన చంద్రబాబు.. స్థానిక టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను అనవసరంగా జైలుకు తరలించారని చెప్పారు. లేనిపోని.. ఆధారాలు కూడా లేని కేసుల్లో రాజకీయంగా ఇరికించారని చెప్పారు. అయినా.. ఆ కష్టానికి ఓర్చుకున్నట్టు తెలిపారు.
తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారన్నారని, వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాన ని చంద్రబాబు అన్నారు. రైతు బిడ్డ ఐటీలో ఎందుకు పనిచేయకూడదని 1990లలోనే ఆలోచన చేశానని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో 30 సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనతో ఈ రోజు ఇంత మంది ఐటీ ఉద్యోగులుగా బెంగళూరులో స్థిరపడ్డారన్నారు. ఐటీని డెవలప్ చేయాలంటే ఆ రోజు ఎగతాళి చేశార న్నారు. అయినా.. వారి ఎగతాళినే అవకాశంగా మార్చుకుని.. నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
“నన్ను హేళన చేసిన వారి పిల్లలే.. తర్వాత కాలంలో నేను స్థాపించిన సంస్థల్లో చదువుకున్నారు. అమెరికాకు వెళ్లారు. ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఎగతాళి, అవమానాలు నాకు కొత్త కాదు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు “థింక్ గ్లోబలీ… యాక్ట్ గ్లోబలీ“ అని చంద్రబాబు ఈ సందర్భం గా పిలుపునిచ్చారు.
పదవులు.. డబ్బు నాకు ముఖ్యం కాదు. నేను ఏం చేశానో ప్రజలు గుర్తుపెట్టుకోవాలనే ధ్యేయంతో పని చేస్తున్నా. నా ప్రజలకు నేను గుర్తొస్తే చాలు.. నా జీవితం ధన్యం – చంద్రబాబు#ChandraBabu #NaraChandrababuNaidu#BangaloreTDPforum#BTFwithCBN pic.twitter.com/4uOxS4Ngl6
— Swathi Reddy (@Swathireddytdp) December 28, 2023