ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బాపట్ల. ఇక్కడ నుంచి వరుసగా వైసీపీ నాయకు డు.. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజయం దక్కించుకున్నారు. ఇక, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున అన్నం సతీష్ ప్రభాకర్ పోటీ చేశారు. అటు వైసీపీ తరఫున కోన, ఇటు టీడీపీ తరఫున అన్నం సతీష్‌లు పోటీ చేశారు. ఈ ఇద్దరి మధ్యే పోటీ హోరా హోరీగా సాగింది. అయితే.. రెండు సార్లు కూడా అన్నం ఓడిపోయారు.
కానీ, ఇప్పుడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీ తరఫునప్రముఖ పారిశ్రామిక వేత్త వేగేశ్న నరేం ద్ర వర్మ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లోనే ఈయన టికెట్ ఆశించారు. అయితే, అప్పట్లో టీడీపీ ఆయన విజ్ఞప్తిని పక్కన పెట్టింది. అయినప్పటికీ.. వేగేశ్న ప్రజలకు చేరువయ్యారు. 2019 ఎన్నికలకు ముందు.. భారీ ఖర్చుతో ఆయన చంద్రబాబు పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రచారం చేశా రు.
దీంతో వేగేశ్నకే టికెట్ ఖాయమని అప్పట్లో ప్రజలు నమ్మారు. దీంతో ఆయనను గెలిపించుకునేందుకు కూడా రెడీ అయ్యారు. కానీ, చివరి నిముషంలో టీడీపీ వ్యూహం మారడం.. వేగేశ్నను పక్కన పెట్టడంతో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. దీనిని గమనించిన చంద్రబాబు ముందుగానే వేగేశ్నను ప్రకటించారు. దీంతో ఇప్పుడు టీడీపీ దూకుడు పెరిగింది. పైగా రెండు సార్లు గెలిపించినా.. కోన తమకు చేసింది ఏమీ లేదని.. ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
మరోవైపు.. వేగేశ్న మరింత దూకుడుగా ప్రజలకు చేరువ అవుతున్నారు. సమస్యలు ఎక్కడున్నా అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. జనరల్ అంశాలకంటే కూడా.. ప్రజల సమస్యలపైనే ఆయన ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో వేగేశ్నకు ఇక్కడ మంచి మార్కులు పడుతున్నాయనే చర్చ కొన్నాళ్లుగా వినిపిస్తోం ది. మరోవైపు.. వైసీపీ తరఫున మరో సారి టికెట్ దక్కినా.. కోన గెలుపుపై వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. వ్యక్తిగతంగా కోన మంచి నేతే అయినా.. ఈ పదేళ్లలో ఆయన చేసింది ఏమీ లేకపోవడం.. మైనస్‌గా మారింది. దీంతో టీడీపీ గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది.