యూట్యూబర్, షార్ట్ ఫిలిమ్స్ సెలబ్రిటీ చందూ అలియాస్ చంద్రశేఖర్ సాయి కిరణ్ రేప్ సహా పలు అభియోగాల మీద అరెస్ట్ కావడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి ఇప్పుడు రాజకీయ రంగును పులిమే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. జనసేన పార్టీ కార్యకర్త అని కోరుకుంటూ.. అతని మీద వచ్చిన అభియోగాలను జనసేనకు ఆపాదించి ఆ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని వైసిపి చూస్తుండడం.
అయితే చందు పవన్ కళ్యాణ్ అభిమాని అనడంలో సందేహం లేదు. అన్న వీడియోలో పలుమార్లు చందు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. సినిమాల పరంగానే కాక రాజకీయాల్లోనూ పవన్ కు అనుకూలంగా వీడియోలు చేశాడు. అయితే అతను జనసేన క్రియాశీల కార్యకర్త మాత్రం కాదు. పార్టీ కోసం అధికారికంగా పనిచేయలేదు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ను కలవను లేదు. ఈ విషయం సోషల్ మీడియా జనాలు అందరికీ తెలుసు. అయినా సరే వైసీపీ ఇదేమి పట్టించుకోకుండా అతని జనసేన కార్యకర్తగా పేర్కొంటూ సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతోంది.
వైసిపి అఫీషియల్ హ్యాండిల్లో చందు గురించి దారుణమైన భాషలో రాస్తూ.. అతని జన సైకోగా అభివర్ణిస్తూ.. జనసేన వాళ్లంటే ఇంతే అంటూ రాయలేని భాషలో పోస్టులు పెట్టారు. ఇక్కడ విడ్డూరమైన విషయం ఏమిటంటే.. కొన్ని రోజుల కిందటే సత్తారు వెంకటేష్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో తీవ్ర అభియోగాలతో అరెస్ట్ అయ్యాడు. అతను చాలా ఏళ్లుగా వైసిపి కోసం పనిచేస్తున్నాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా వైసిపి స్టేట్ కోఆర్డినేటర్ అనే ఉంటుంది.
జగన్ సహా పలువురు వైసిపి కీలక నేతలతో అతడి ఫోటోలు బోలెడన్ని ఉన్నాయి. వైసీపీ తరఫున కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు అతను. అలాంటి వ్యక్తిని వైసిపి డిస్ ఓన్ చేసుకుంది. వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని.. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతమని పేర్కొంటూ చేతులు దులుపుకుంది. కానీ జనసేన పార్టీతో ఏ సంబంధం లేని చందును మాత్రం టార్గెట్ చేస్తూ ఆ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది చూసినట్లు నెటిజన్లు నివ్వెరపోతున్నారు.