కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి సుప్రీంకోర్టు జై కొట్టింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి(అటానమస్) కలిగించే ప్రత్యేక రాజ్యాంగ ఆర్టికల్ 370 ని 2021లో మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే… దీనిని రద్దు చేయడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు నిరసించారు. ప్రత్యేక పరిస్థితుల్లో నే అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆర్టికల్ 370ని ప్రతిపాదించింది.
అయితే.. జమ్ము కశ్మీర్‌ను అన్ని రాష్ట్రాలతో సమానంగా చూడాలని.. దీనికి ప్రత్యేక ప్రతిపత్తి అవసరం లేదని పేర్కొంటూ మోడీ సర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రజాసంఘాలు, పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా.. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
వీటిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుధీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది.
ఏంటీ 370?
+ జమ్ము కశ్మీర్‌ను ప్రత్యేకంగా పాలించుకునే హక్కు ఉంటుంది.
+ భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్న డిమాండ్ ఇక్కడ వర్తించదు.
+ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకంగా రాజ్యాంగం ఉంది. దీనినే అనుసరిస్తున్నారు.
+ జమ్ము కశ్మీర్లో ఉన్నవారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చు.. కానీ, ఇతరులు ఎవరూ ఇక్కడకు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేయకూడదు.
+ వ్యాపారులు కూడా ఎవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదు.
+ ఇతర రాష్ట్రాల రైతులు ఇక్కడ వ్యవసాయం చేయకూడదు.
+ ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి వారిని వివాహం చేసుకోవడం, వివాహేతర సంబంధం పెట్టుకోవడం నిషేధం.
+ జమ్ము కశ్మీర్లో ఇతర రాష్ట్రాల వారు ఆస్తులు కొనరాదు.
మోడీ ఏం చేశారు?
+ మోడీ సర్కారు 370 ఆర్టికల్ ను రద్దు చేసి.. పైనున్న అన్ని నిబంధనలను తోసి పుచ్చింది. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు ఉన్న హక్కులు, అధికారాలు.. ఈ రాష్ట్రానికి అంతే సమానంగా అనువదించబడతాయి. ఇక్కడివారిని ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టొచ్చు. వ్యవసాయం చేసుకోవచ్చు. ఆస్తులు కొనచ్చు. రాజకీయాల్లో పాల్గొనవచ్చు. పోటీ కూడా చేయొచ్చు.