తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. పైగా.. ఎలాంటి భయం బెరుకు లేకుండా.. పార్టీ అధికారంలోకి వచ్చేసే అవకాశం కనిపిస్తున్నాయి. జంపిం గులకు కూడా ఆస్కారం కనిపించడం లేదు. దీంతో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమే. ఇక, ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సీఎం అంటూ.. యువత నినాదాలు చేస్తోంది.
మరోవైపు.. నిన్న మొన్నటి వరకు సీఎం రేసులో ఉన్న పలువురు నాయకులు కూడా రేవంత్ విషయంలో సానుకూల దృక్ఫథంతో ఉన్నారు. దీంతో రేవంత్ సీఎం కావడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు. ఇదిలావుంటే.. నెటిజన్లు రేవంత్ విజయాన్ని ఆస్వాదిస్తూ.. చంద్రబాబు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మరో గిఫ్ట్ రేవంత్ రెడ్డి అని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఏమీ రాజకీయం లేదు. వారు.. ఉన్నది ఉన్నట్టే చెబుతున్నారు.
రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది.. చంద్రబాబు హయాంలోనే. అప్పట్లో ఆయనను అన్ని విధాలా తీర్చిదిద్దింది చంద్రబాబే. కొడంగల్ స్థానం నుంచి టికెట్ ఇవ్వడం నుంచి తొలుత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం.. వంటి పరిణామాలన్నీ..చంద్రబాబు హయాంలోనే జరిగాయి. ఆయన ఒక నాయకుడిని తీర్చిదిద్దారంటే.. ఎలా ఉంటుందనేభావనకు రేవంత్‌రెడ్డిని నెటిజన్లు ఉదాహరణగా చూపిస్తున్నారు.
వ్యక్తిగతంగా రేవంత్‌లో టాలెంట్ ఉన్నా.. దానిని వెలికి తీసి.. రాజకీయాలకు అనుగుణంగా మలిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “తెలంగానకు సైబరాబాద్ ఇచ్చారు, హైటెక్ సిటీ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా.. తెలంగాణకు సారథినే ఇచ్చారు“ అని రేవంత్‌ను రాజకీయంగా చంద్రబాబు తీర్చిదిద్దిన వైనాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.