తాజాగా.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ.. తన సొంత మరిది.. దివంగత వివేకానందరెడ్డి హత్యపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. రాసిన ఐదు పేజీల లేఖ పెను దుమారం రేపుతోంది. వివేకా హత్య కేసుపై నిజానికి ఆమె స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. అనుకున్నట్టుగానే దాదాపు రెండేళ్లుగా ఆమె స్పందించలేదు. కానీ, ఇప్పుడు ఆమె అనూహ్యంగా స్పందించారు.
అయితే..ఈ స్పందన వెనుక.. వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కొన్ని రోజుల కిందట వివేకా కుమార్తె.. సునీత్ ఢిల్లీలో.. మాట్లాడుతూ.. తన తండ్రి మరణం వెనుక రాజకీయ కుట్ర ఉందని నేరుగా చెప్పేశారు. దీంతో ఈ పరిస్థితి.. రాజకీయంగా జగన్‌కు ఇబ్బందిగా మారింది.
తన సొంత బాబాయి.. పార్టీలో ఒకప్పటి కీలక నాయకుడు హత్యకు గురైతే.. ఇప్పటికీ దీనిపై విచారణ ముందుకు సాగకపోవడం.. దీని వెనుక రాజకీయ కోణం ఉందని సునీత ఆరోపించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా.. సానుకూలత వచ్చే అవకాశం లేదని గుర్తించారు. దీంతో విజయమ్మను రంగంలోకి దింపారని అంటున్నారు.
వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందేనని విజయమ్మ అన్నారు. ఈ హత్యపై సీఎం జగన్, షర్మిల, తనిది ఒకే మాట అని స్పష్టం చేశారు. ఇటీవల తిరుపతి ఎన్నికల ప్రచారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వివేకా హత్యకు గురైతే ఇప్పటి వరకు ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమని విమర్శించా రని.. అయితే.. సీబీఐ విచారణ కేంద్ర ప్రభుత్వానిదని, పవన్ విమర్శలు అర్ధరహితమని విజయమ్మ కొట్టిపారేశారు.
అయితే.. విజయమ్మ పేరిట హల్ చల్ చేస్తున్న ఈ ఉత్తరం వెనుక .. ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి హస్తం ఉందని.. సీఎం జగన్ కనుసన్నల్లో.. సజ్జలే దీనిని తయారు చేయించి.. విజయమ్మ పేరిట.. విడుదల చేసి ఉంటారని కొందరు అనుమానపడుతున్నారు. ఇలా అనడానికి కూడా ఒక కీలకమైన రీజన్ ఉంది. సదరు ఐదు పేజీల లేఖపై ఎక్కడా విజయమ్మ సంతకం లేక పోవడంతో ఈ అనుమానాలు పెల్లుబుకుతున్నాయి.
ప్రస్తుతం రాజకీయంగా ఈ విషయాన్ని ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధం గా లేరు. ఈ క్రమంలో ఎవరు కీలక నేతలు స్పందించినా.. ఇది మరో వివాదంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో .. ఇప్పుడు ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే.. విజయమ్మ అయితేనే కరెక్ట్ అని భావించి.. సీనియర్ పాత్రికేయుడైన.. సజ్జలతో దీనిని రూపొందించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరి వాస్తవాలు ఏంటనేది.. తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలేమో!!
https://twitter.com/i/status/1379465607855267842