స్కిల్ కార్పొరేషన్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని షరతులు కూడా విధించింది. అదేసమయంలో మరికొన్ని ఆంక్షలు కూడా విధించింది. అయితే.. ఇప్పుడు ఆ ఆంక్షలు సరిపోవని, మరిన్ని ఆంక్షలు విధించాలని కోరుతూ.. ఏపీ సీఐడీ అధికారులు రాష్ట్ర హైకోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేశారు. ప్రస్తుతం విధించిన ఆంక్షలను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని కూడా పేర్కొనడం గమనార్హం.
ఇవీ సీఐడీ పిటిషన్లో అంశాలు..
+ టీడీపీ అధినేత చంద్రబాబును ఇద్దరు సీఐడీ డీఎస్పీలు నిరంతరం అనుసరిస్తారు. ఈ మేరకు అనుమతించాలి.
+ సొంత పార్టీ టీడీపీ సహా.. ఎలాంటి పార్టీల రాజకీయ కార్యకలాపాల్లో చంద్రబాబు పాల్గొనకుండా ఆంక్షలు విధించాలి.
+ మీడియాతోనూ చంద్రబాబు మాట్లాడకుండా ఆంక్షలు విధించాలి(తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడడాన్ని ప్రస్తావించారు)
+ రాజకీయ నేతలతో మాట్లాడటం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయకుండా ఆంక్షలు విధించాలి.
+ మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్య ఇచ్చారని.. దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని ఈ విషయంలోనూ ఆయనను దిశానిర్దేశం చేయాలని సీఐడీ కోరింది.
+ బెయిల్ సమయాన్ని కేవలం చికిత్సకు మాత్రమే చంద్రబాబు వినియోగించుకునేలా ఆదేశించాలని తాజాగా దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టును సీఐడీ అభ్యర్థించింది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.