ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను నవంబర్ 9వ తేదీకి దేశపు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. పీటీ వారెంట్ పై నవంబర్ 9వ తేదీ వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని, నవంబర్ 9వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
మరోవైపు, స్కిల్ స్కీం కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. దాంతోపాటు, విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును పిటి వారెంట్‌పై, చంద్రబాబు హెల్త్ రిపోర్ట్, చంద్రబాబుతో లీగల్ ములాఖత్ ల తగ్గింపు తదితర పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ లిస్ట్ కోసం చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్ పై కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఏవిధంగా ఉండబోతోంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది.