తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నారై టీడీపీ, జనసేనల ఇచ్చిన పిలుపుమేరకు బే ఏరియా, మౌంటైన్ హౌస్ ఎన్నారైలు ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతును తెలియజేశారు.
పెద్ద ఎత్తున ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు జగన్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.