టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అర్ధరాత్రి నుంచి కాపుగాసి తెల్లవారుజామున అరెస్ట్ చేయడం పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు టిడిపి నేతలు ఖండిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టును టిడిపి ఎన్నారై నేతలు కూడా ఖండించారు. అమెరికాలోని బే ఏరియాలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఎన్నారై నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నందమూరి బాలకృష్ణ అల్లుడు, గీతం విద్యాసంస్థల అధినేత మతుకుమిల్లి భరత్ తో పాటు పలువురు టిడిపి ఎన్నారై నేతలు, చంద్రబాబు అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి ఎన్నారై నేత జయరాం కోమటి, వెంకట్ కోగంటి, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, చంద్ర గుంటుపల్లి, భక్త బల్లా, శ్రీకర్ రెడ్డి, హరీష్ సన్నిధి, సురేష్ పోతినేని, భాస్కర్ వల్లభనేని, వెంకట్ అడుసుమిల్లి, గోకుల్ రాజు, భరత్ ముప్పిరాల, హర్ష యడ్లపాటి, జెట్టి వెంకయ్య, కృష్ణమోహన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘ఖండించండి చంద్రబాబు గారి అరెస్టును…నశించాలి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి…డౌన్ డౌన్ జగన్…నశించాలి జగన్ మోహన్ రెడ్డి మొండి వైఖరి…’’అంటూ వారంతా జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.