‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు నంద్యాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. గతంలో జగన్ బల్లగుద్ది మరీ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని చంద్రబాబు తూర్పారబట్టారు. అంతేకాదు, వేలాదిమంది ప్రజల ముందు జగన్ ను చంద్ర బాబు ర్యాగింగ్ చేశారు. హామీల విషయంలో స్వయంగా జగన్ చెప్పిన మాటలతో ఆడియో క్లిప్పులను అక్కడ ప్లే చేసి జగన్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు.
25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానని చెప్పిన జగన్ ఈనాడు హోదా ఉసే ఎత్తడం లేదని చంద్రబాబు చురకలంటించారు. ఇక, మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్న జగన్ అంటూ సెటైర్లు వేశారు. జాబ్ క్యాలెండర్, పోలవరం పూర్తి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక హామీలను ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చారని, వాటిని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఇక్కడ వీడియో వేసి జగన్ సినిమా మొత్తం చూపించేవాడినని, కానీ ఇక్కడ స్క్రీన్లు లేవు కాబట్టి ఆడియో క్లిప్పులు మాత్రమే ప్లే చేస్తున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ హామీలను ఆయన మాటలలోనే విందామని అన్నారు.
ఈ ఆడియో క్లిప్ విన్న తర్వాత ఇటువంటి దుర్మార్గుడికి, అబద్దాలకోరుకు ఓటు వేయాలో లేదో మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ కు సిగ్గులేదని, తాను ప్రారంభించిన ఎయిర్ పోర్టును మళ్లీ ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి సిగ్గులేకుండా రంగులు వేసుకున్నారని, తన పేరు తీసేసి జగన్ పేరు వేసుకుని ఎయిర్ పోర్టు ప్రారంభించారని ఎద్దేవా చేశఆరు. ఓర్వకల్లుకు పరిశ్రమలు రప్పించలేకపోయారని విమర్శించారు.
ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను నంద్యాల సభలో ప్రస్తావించిన టీడీపీ అధినేత @ncbn గారు. జగన్ నాటి హామీలు, వాగ్దానాలు వాయిస్ ప్లే చేసి వినిపించిన టీడీపీ అధినేత. ఒక్కో అంశాన్ని ప్రస్తావించి జగన్ హామీలపై ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారు. #CBNinNandyala#TDPforDevelopment… pic.twitter.com/V5nnk5Z0Ij
— Telugu Desam Party (@JaiTDP) September 8, 2023