ఏపీ సీఎం జగన్‌పై జనసేన తాజాగా విరుచుకుపడింది. బుధవారం జరిగిన అమ్మ ఒడి నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. “ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటాడు. అలా మనం చేసుకోలేం. పెళ్లి అనే సంప్రదాయాన్ని, పవిత్ర బంధాన్ని కూడా బజారుకు ఈడుస్తాడు“అని సీఎం జగన్.. పవన్‌పై విమర్శలు చేశారు.
అయితే.. జగన్ చేసిన విమర్శలకు.. తాజాగా జనసేన కౌంటర్ ఇచ్చింది. “పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఈ మూడు పెళ్లిళ్లు కూడా ఏయే సందర్భాల్లో చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే వివరించారు. అయినా.. కూడా జగన్ విమర్శిస్తున్నారు. ఇది సరికాదు. ఇక్కడ ఇంకో మాట.. ఏంటంటే.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని జగన్ అన్నారు. ఆ నాలుగో పెళ్లి జగన్ చేశాడా? ఆయన బంధువుల అమ్మాయితో పవన్‌కు పెళ్లి చేశాడా?“ అని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు నిప్పులు చెరిగారు.
పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటానికి సీఎం స్థాయి వ్యక్తికి సిగ్గు ఉండాలన్నారు. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని జగన్ అంటున్నారని.. నాలుగో అమ్మాయి ఏమైనా ఆయన బంధువా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కాల్చి చంపాలని అన్న జగన్ ఇప్పుడు ఏదైనా మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు. పవన్ ప్యాకేజీ స్టార్ కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కి అసహనం పెరిగిపోయిందని దుయ్యబట్టారు.
జగన్‌కు సరిగా తెలుగు కూడా రాదని తాతారావు ఎద్దేవా చేశారు. వారాహికి బదులు.. వరాహి అంటున్నావని ఎద్దేవా చేశారు. 175 గెలుస్తానని అంటున్న జగన్.. పవన్ వారాహి యాత్ర చేస్తే తట్టుకోలేక పోతున్నాడని దుయ్యబట్టారు. జగన్ కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. పవన్ పెళ్లిళ్ల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు.