ప్రాణాలుపోతుంటే కులం అంటావేరా దివాన్..!!
2021 హిందూపురం మున్సిపల్ ఎలక్షన్స్ సమయం.
ఎన్నికల ప్రచారానికి బాలయ్య హైదరాబాద్ నుంచి బెంగుళూరు మీదుగా హిందూపురం వెళ్ళడానికి ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ బాలయ్య బయల్దేరాడనగానే అక్కడ.
“జై బాలయ్య జై జై బాలయ్య”
అని హిందూపూర్ మోతమోగిపోతుంది…
బాలయ్యవెంటే నా స్నేహితుడు కూడా ఉన్నాడు….
ఈలోపు బాలయ్య ఫోన్ మోగింది….
నియోజకవర్గ ప్రజలకి బాలయ్య అందుబాటులో లేనిసమయంలో హిందూపూర్ వ్యవహారాలు చూసుకునేి కీలకవ్యక్తుల్లో
ఒకడు అవతల లైన్లో ఉన్నాడు…
కాస్త బెరుగ్గానే “సార్, మన నియోజకవర్గం నుంచి ఈవిడెవరో తనబిడ్డ ఆరోగ్యంగురించి మీతో మాట్లాడాలని వారం రోజుల్నుంచి పోరుపెడుతుంది.
ఇవ్వమంటారా
” అని అడగ్గానే #బాలయ్య ”
వెంటనే ఇవ్వు ” అన్నారు…ఇక్కడ ఒక్కమాట.
ఆవిడ భర్త కరడుగట్టిన వైసీపీ కార్యకర్త….
ఇటీవలే కరోనాతో కన్నుమూశాడు పైగా #రెడ్డి_కులస్తులకు టీడీపీతో పనేంటని బలవంతంగా వాళ్ళఊర్లో #రెడ్లని వైసీపీలో చేర్చిన చరిత్ర ఆయనది….
అలాంటి కరుడుగట్టిన టీడీపీ వ్యతిరేక కుటుంబం…
ఆవిడ ఫోన్ అందుకుని ” చావుబ్రతుకుల్లో ఉన్న తనబిడ్డ ఆరోగ్యస్థితి గురించి, వెంటనే ఆపరేషన్ చెయ్యాల్సిన అవసరం గురించి, ప్రభుత్వంనుంచి ఏవిధమైన స్పందన లేకపోవడం, తన ఆర్ధికస్థితి గురించి గబగబా మాట్లాడి ఏడుపు లంకించుకుంది…
బాలయ్య ఒక్క నిమిషంకూడా ఆలోచించకుండా ”
మరేం పర్లేదమ్మా…. బాధపడొద్దు…
నేనిప్పుడే హైదరాబాద్ లో కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి మీ బిడ్డకి ఆపరేషన్ చేయిస్తా….
హిందూపురం నుంచే అంబులెన్సు ఏర్పాటు చేయిస్తా మీరు ఇంటిదగ్గిర సిద్ధంగా ఉండండి అని చెప్పి ఫోన్ అతనికి ఇవ్వమన్నారు …
అతను ఫోన్ అందుకుని కొంచెం దూరంగావచ్చి బాలయ్యతో ఫోన్లో ” సార్ వాళ్ళు రెడ్లు…పైగా వైసీపీ కార్యకర్తలు” అంటుంటుండగానే….
సహనం కోల్పోయిన సింహం “అవతల ప్రాణాలుపోతుంటే కులం అంటావేరా దివాన్….
ముందు ఏదోఒక అంబులెన్సులో తల్లీబిడ్డని ఎక్కించి, ఒక పదివేలు డబ్బులిచ్చి
హైదరాబాద్ వచ్చే ఏర్పాటు చెయ్యి” అని ఫోన్ పెట్టేసి వెంటనే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి.
చైర్మన్ అందుబాటులో లేకపోయినా ఫోన్ ఎత్తిన అతనితో విషయం చెప్పి.
ఆపరేషన్ కి సిద్ధం చెయ్యమన్నారు…ఈలోపు ఫ్లైట్ కి సమయం అవ్వడంతో ఫ్లైట్ ఎక్కిన బాలయ్య తిరిగి బెంగుళూరులో దిగగానే
మళ్ళీ హాస్పిటల్ కి ఫోన్ చేసి…
ఈసారి చైర్మన్ తోనే మాట్లాడి సమస్య పరిష్కరించారు…. తనబిడ్డకి ప్రాణగండం గట్టెక్కి ఆరోగ్యంగా ఇంటికి చేరడంతో బాలయ్యే తన దేవుడని పూజిస్తోంది ఆ తల్లి….
ఎంత మంచి మనసు బాలయ్యా నీది…
అందుకే మొన్నటి ఎలక్షన్లలో చాలా నియోజకవర్గాల్లో రైకాపా గెలిచినా..
నీతో తలపడలేక తోకముడిచాయి….
పుట్టినరోజు శుభాకాంక్షలు బాలయ్యా….