టిడిపి ప్రకటించినటువంటి మేనిఫెస్టో పై ఊరువాడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక అంశాలపై గ్రామీణ స్థాయిలో చర్చ జోరుగా ఉంది. చంద్రబాబు ప్రకటించినటువంటి వివిధ పథకాలు ప్రజల్లోకి వెంటనే చేరాయి అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా కూడా మినీ మేనిఫెస్టో మీదే ఉండటం గమనార్హం. గతంలో ఇంత భారీ స్థాయిలో చంద్రబాబు ఇలాంటి ఉచిత పథకాలు ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో ఏమేమి ఇస్తాను ఎవరెవరికి ఏమి చేస్తానని స్పష్టంగా చెప్పడం గ్రామీణ స్థాయిలో చంద్రబాబు జై కొట్టేలా చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఇస్తారు అనేది ఒకటి మాత్రమే చర్చిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతులు మహిళలు వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరికీ కూడా పింఛన్లు ఇతరత్రా పథకాలు విషయంలో చంద్రబాబు చేసినటువంటి ప్రకటన, ప్రకటించిన మేనిఫెస్టో ఇతర విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాసంగా మారాయి. నిజానికి ఇట్లాంటి పథకాలు వైసీపీ మాత్రమే పేటెంట్ హక్కుగా భావించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా తను ఉచితలకు వ్యతిరేకం కాదని ప్రజల అభ్యున్నతి ప్రజల అభివృద్ధి ముఖ్యమని చాటుతూ ఉచితాలకు కూడా పెద్దపీట వేశారు.
ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరింత చర్చకు పెట్టడం ప్రజలను మేనిఫెస్టో దిశగా ఆలోచన చేసేలా వారిని టీడీపీ వైపు మొగ్గేలా చేయటం అనేది ఇప్పుడు టిడిపి నాయకులకు ముందున్నటువంటి బాధ్యత. చంద్రబాబు ఇచ్చే పథకాలు… ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను టీడీపీ కార్యకర్తలు నాయకులు భుజాన వేసుకోవాలని కూడా చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. దీంతో వచ్చే రోజుల్లో ఊరూవాడా.. మహానాడు మేనిఫెస్టో.. ఒక సంచలనంగా మారనుందని అంటున్నారు పరిశీలకులు. ఇక, టీడీపీ నాయకులు ఇప్పటికే భారీ ఎత్తున కరపత్రాలు ముద్రించి.. పంచేందుకురెడీ అయ్యారు.