చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో ఈ మినీ మేనిఫెస్టో నిజంగానే ఒక సంచలనంగా మారింది. ఎన్నికలకు 10 నెలల ముందే చాలా ఆసక్తిగా చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. నిజానికి 1982లో టిడిపి స్థాపించిన తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ఏనాడూ కూడా మేనిఫెస్టోను 10 నెలల ముందు ప్రకటించినటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదనే చెప్పాలి. ఎన్నికలకు మూడు నెలల ముందు లేకపోతే 2 నెలల ముందు మేనిఫెస్టోను ప్రకటించేటటువంటి సంస్కృతి టిడిపిలో ఎప్పుడు కనిపించింది.
కానీ దీనికి భిన్నంగా ఈసారి సంక్షేమ పథకాలతోనే చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను 10 మాసాల ముందు ప్రకటించటం సర్వత్రా రాజకీయ చర్చకు దారి తీసింది. ఇది ఇలా ఉంటే అసలు ఈ మేనిఫెస్టో పై పట్టణ ఓటర్లు ఏమనుకుంటున్నా రు పట్టణాల్లో ఈ మేనిఫెస్టో పై ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు వరకు అప్పులు చేస్తున్నారు జగను అప్పులు చేసే ప్రజలకు పంచుతున్నారు అని పట్టణ ఓటర్లు ముఖ్యంగా యువత మధ్యతరగతి పనులు కట్టేటటువంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీకి చాలా వ్యతిరేకంగా వారు చక్రం తిప్పారు.
ఇది టిడిపికి చాలా అనుకూలంగా మారింది అనేటటువంటి అంచనాలు వచ్చాయి. ఎందుకంటే పట్టణాల్లో ఉన్నటువంటి వారు కోరుకునేది రోడ్లు వేయడం ప్రాజెక్టులు పూర్తి చేయటం రాజధాని నిర్మాణం ఇతర పరిశ్రమలను తీసుకురావడం ఉపాధి కల్పించడం, పన్నులు తగ్గించటం అనేది వారు కోరుకునేటటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ అంశాలు. అయితే వైసిపి వీటికి దూరంగా జరిగిపోయింది. చెత్త మీద పన్ను వేసింది అలాగే పెట్రోల్ సెస్సులు ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా వసూలు చేస్తున్నారు దీంతో పట్టణాల్లో ఉన్నటువంటి వాటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇలాంటి సమయంలో టిడిపి పై వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. తాము టిడిపి కనుక వస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పన్నులు భారాలు లేనటువంటి ప్రభుత్వం మనం చూడవచ్చని అదేవిధంగా అవినీతి అక్రమాలకు అంతోరితో బ్రేకులు పడతాయి అని ఆశించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాల వైపు వెళ్లడం వైసిపి కన్నా కూడా వైసిపి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల కన్నా కూడా రెట్టింపు స్థాయిలో డబ్బులు ఇస్తానని చెప్పి ప్రకటించడం అంటివి వాస్తవానికి పట్టణ ఓటర్లను నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.
చంద్రబాబు నాయుడు అంటే విజనన్న ముఖ్యమంత్రిగా విజనున్న నాయకుడిగా, అభివృద్ధికి కేంద్రంగా ఆయనను పట్టణ ఓటర్లు ఇప్పటికీ అభిమానిస్తారు. ప్రేమిస్తారు. ఎన్నికల సమయంలో పట్టణాల్లో 2019లో టిడిపి మెజారిటీ ఓటు బ్యాంకు ను సంపాదించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఓటర్లు టిడిపిని గెలిపించారు. విశాఖలో నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది. విజయవాడలో తూర్పు నియోజకవర్గం సహా విజయవాడ ఎంపీ కూడా టిడిపి గెలిచింది. అదేవిధంగా గుంటూరు వెస్ట్ టిడిపి దక్కించుకుంది.
ఇట్లా చాలా బలమైనటువంటి చదువుకున్నటువంటి ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి గెలుపు గుర్రం ఎక్కడానికి ప్రధాన కారణం. చంద్రబాబు ఇప్పుడు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలో కచ్చితంగా అభివృద్ధి, విజన్ ఈ రెండు మిస్ అయ్యాయి. అయితే భవిష్యత్తులో రానున్న పూర్తిస్థాయి మేనిఫెస్టోలో వీటిని ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు అయితే మినీ మేనిఫెస్టో ఆధారంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళితే పట్టణ ఓటరు నాడి పట్టుకోవడం చాలా కష్టంగా మారింది అనేది సందేహం లేదు. వీరు తటస్థంగా అయినా ఉండొచ్చు లేదా పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.