10 రోజుల అమెరికా పర్యటన కు వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యులు ‘రాహుల్ గాంధీ’ కి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్ పర్సన్ శామ్ పిట్రోడా, మాజీ పార్లమెంట్ సభ్యులు మ ధు యాష్కీ గౌడ్, వెటా వ్యవస్థాపకులు శ్రీమతి ఝాన్సీ రెడ్డి, స్థానికులు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు
సాధారణ పాస్పోర్ట్ తో వచ్చిన ‘రాహుల్ గాంధీ’ రెండు గంటలు క్యూ లో నిలబడి ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం విశేషం.
రాజకీయ కారణాలతో ‘మోడీ ప్రభుత్వం’ ‘రాహుల్ గాంధీ’ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి, నివాసం ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయించడం తెలిసిందే.