తాజాగా చంద్రబాబునాయుడు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో పై వైసీపీ నాయకులనుంచి సూటి విమర్శలు వస్తున్నాయి. ఇది కాపీ చేశారని కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి కొన్ని కాపీ చేశారని, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను అమ్మవడి వంటివి తల్లివందనం పేరుతో మార్చారని దీంట్లో కొత్తగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోగాలు లేవని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఏది కనిపించడం లేదని కొడాలి నాని వంటి వారు కొంత పరుషంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రి మేరుగ నాగార్జున కూడా సంక్షేమానికి తామే పేటెంట్ అని వ్యాఖ్యానించారు.
అయితే ఇక్కడ వాస్తవం తీసుకుంటే కాపీ అనేటటువంటిది అంగీకరించడానికి వీలు లేనటువంటి అంశం. దేశవ్యాప్తంగా రాజకీయాలను తీసుకుంటే అన్నిచోట్ల అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు. అన్ని పార్టీలు కాపీ చేస్తున్నాయని చెప్పాలి. ఉదాహరణకు అమ్మ ఒడి పథకాన్ని జపాన్ నుంచి జగన్ తీసుకున్నారు. ఇది స్పష్టంగా ఆనాడు ఎన్నికల సమయంలోనే చెప్పారు. అక్కడ జపాన్లో జనాల జనాభా సంఖ్య తక్కువ. పిల్లలను కనేవారు లేరు. దీంతో జపాన్లో ప్రతి ఇంటికీ పిల్లల్ని కంటే ఇంత సొమ్ము ఇస్తామని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.
అదేవిధంగా చైనా 2018 సమయంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఉద్యోగం ఇస్తామని, అదేవిధంగా రుణం ఇస్తామని అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుచేస్తామని చైనా ప్రభుత్వం కూడా ప్రకటించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో అమలవుతున్న పథకాలు అటు ఇటుగా మార్చి ఇక్కడ అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారని చెప్పడంలో సందేహం లేదు. ఇక అదే విధంగా గ్యాస్, అదే విధంగా రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి పథకాన్ని తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పేరు పెట్టి ఇస్తున్నారు. మరి ఇది కూడా కాపీ అనే చెప్పాలి కదా.
అదే విధంగా పింఛన్లు. పింఛన్లు అనేది దేశవ్యాప్తంగా అందరూ ఇస్తున్నది. కాకపోతే అమౌంట్ పెంచి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు కాబట్టి కాపీ అనేటటువంటిది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసింది కూడా కాపీ అనే చెప్పాల్సి ఉంటుంది. జగనన్న ఇల్లు అనేది కూడా రాష్ట్రంలో ఎన్టి రామారావు పేదల కోసం ఇల్లు కట్టించి ఇచ్చారు. కాబట్టి ఆ పథకం ఈరోజు కొత్తగా జగనన్న ఇల్లు అనేటటువంటి పథకం రాలేదు. గతంలోనే కొన్ని దశాబ్దాల కిందటే ఎన్.టి.రామారావు హయాంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా చెప్పాలి అంటే ఇందిరాగాంధీ కూడు గూడు గుడ్డ అనేటటువంటి నినాదాన్ని అందిపుచ్చుకొని రామారావు అందరికీ ఇల్లు రెండు రూపాయల కిలో బియ్యం అదేవిధంగా జనతా వస్త్రాలు పథకాన్ని అమలు చేశారు.
అంటే ఇక్కడ కాపీ అనేటటువంటి మాట ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ విషయాలు ప్రస్తావించాల్సివస్తుంది. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించుకునేందుకు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించేందుకు సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ తప్ప ఇందులో ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టాలి అనేటటువంటిది ఏదీ ఉండదు. ఒకరు బాగా చేస్తున్నప్పుడు లేదా ఒక పథకం ప్రజల్లోకి బాగా వెళ్ళింది అని అనుకున్నప్పుడు దాన్ని మేము ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు.
ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది బస్సులో మహిళలందరికీ ఉచిత ఉచితంగా ప్రయాణాన్ని అందిస్తామని చెప్పింది. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రకటించినటువంటి పథకం అంటే కానేకాదు. ఇది తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం ఇది డిఎంకె ప్రభుత్వంలో కరుణానిధి ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని తర్వాత ఇప్పుడు దాన్ని మరింతగా ఇంప్లిమెంట్ చేసి మెట్రో సర్వీసుల్లో కూడా స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పించింది.
కాబట్టి పథకాలు కాపీ అనేటటువంటి మాట అప్రస్తుతం. ఎవరు బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఎవరు ఎక్కువ మందికి ప్రయోజనం చేయగలుగుతారు అనేదే ఇక్కడ ముఖ్యం తప్ప పథకాలు కాపీ అనుకుంటే అన్ని పథకాలు అందరూ ఎవరు స్వయంగా ఎవరు కనిపెట్టినవి కాదు. ఎక్కడో ఒకచోట ఎవరో ఏదో ఒక సందర్భంలో తెచ్చినవే. కాబట్టి వైసిపి నాయకులు ఈ విషయాన్ని అంతటితో ఆపేస్తే వారికే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.