పూర్ టు రిచ్.. అంటూ తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) సంచలన హామీలు ఇస్తూ అదిరిపోయే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది.
ఏపీ ప్రజల ఆలోచనలకు తగినట్టే చంద్రబాబు కూడా మారిపోయారు.
ఏపీ ప్రజలకు ఫ్రీ పథకాలపై ఉన్న మోజును అర్థం చేసుకుని తనకు నచ్చకపోయినా మారిపోయారు.
నేరుగా నగదు పథకాలకు శ్రీకారం చుట్టారు.
ముందు గా చెప్పినట్టే సంచలన హామీలను ప్రకటించారు.
1 . Mahashakti scheme ( మహా శక్తి పథకం )
తెలుగుదేశం మేనిఫెస్టో : భవిష్యత్తుకు గ్యారెంటీ
మహాశక్తి
ఆడబిడ్డ నిధి నెలకు 1500
ఇద్దరుంటే ఇద్దరికీ
18 నుండి 60 సంవత్సరాల వారికి.
తల్లికి వందనం క్రింద
ఒక్కొక్కరికి ఏడాదికి 15000
కుటుంబంలో ఎంతమంది పిల్లలు వున్నా అందరికీ
ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
ఆయా జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
యువగళం
20 లక్షల ఉద్యోగాలు
ఉద్యోగం వచ్చే వరకు నెలకు యువగళం నిధి 3000
అన్నదాత
సంవత్సరానికి ఒకే విడతలో రైతుకు 20 వేల రూపాయల సహాయం
మద్దతుధర కల్పన భరోసా
రైతులకోసం ప్రత్యేక ప్రణాళికలు, సబ్సిడీ
సంవత్సరానికి 20000
ఇంటింటికి మంచినీరు
ప్రతి ఇంటికి త్రాగునీరు
బిసిల రక్షణ చట్టం
బిసిల కోసం ప్రత్యేక చట్టం
పూర్ టు రిచ్
ప్రపంచానికి ఆదర్శంగా ఆంధ్రాలో పేదవాడు లేకుండా పేదవాడిని సంపన్నులను చేస్తాం.