తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికగా.. చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్య లు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడని చంద్రబాబువ్యాఖ్యానించారు. “వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎర్ర గంగిరెడ్డిని ఏ1గా చేర్చింది. కానీ, నేడో రేపో.. ఈయన పేరు పోయి.. ఏ1గా జగన్ పేరు నమోదవడం ఖాయం“ అని చంద్రబాబు చెప్పారు.
వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు అని ఆరోపించారు. వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారని సీబీఐ చెప్పిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివేకా హత్యలో ప్రతి విషయం జగన్కు తెలిసే జరిగిందని కోర్టులో సీబీఐ చెప్పిందన్న చంద్రబాబు.. సీబీఐ వ్యాఖ్యలపై జగన్ మోహన్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ”వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు. వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారని సీబీఐ చెప్పింది. వివేకా హత్యలో ప్రతి విషయం జగన్కు తెలిసే జరిగిందని సీబీఐ చెప్పింది. సీబీఐ వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పి తీరాలి“ అని బాబు అన్నారు.
హంతకుల నుంచి కాపాడాలి!
“వైఎస్ వివేకా హత్యా నేరాన్ని నాపై మోపారు. సాక్షాత్తూ బాబాయిని చంపారని సీబీఐ అంతఃపుర మిస్టరీ బయటపెట్టింది. హత్య చేసిన వ్యక్తి, చేయించిన వ్యక్తి రాజకీయాల్లో ఉండొచ్చా..?. హత్యలు చేయించే వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. హత్య గురించి ఎవరికీ తెలియకముందే జగన్కు తెలుసని సీబీఐ చెప్పింది. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది.. ?. దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలకు జగన్ జవాబు చెప్పాలి… హత్యకు ముందు, తర్వాత నిందితులు అవినాష్ ఇంట్లోనే ఉన్నారు. వివేకానందా రెడ్డి హత్య కేసు విషయాలన్నీ అవినాష్ ప్రతి నిమిషం జగన్కు వివరించాడు.” అని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.