టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాల్సి ఉందని.. ఇస్తే.. కనుక దేశానికి ఇచ్చినట్టేనని.. దేశం తనను తాను గౌరవించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని అన్నారు.
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని కైత్లాపూర్లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబు సహాపలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కు దేశ, విదేశాల్లో ఘన నివాళులు అర్పిస్తున్నారని, ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని తెలియజేశారు.
అవినీతి భరించలేక..
ఎన్టీఆర్ తన డిగ్రీ పూర్తికావడంతోనే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. అయితే, లంచాలు, అవినీతి వంటివి ఆయనకు నచ్చక ఉద్యోగానికే రాజీనామా చేశారని తెలిపారు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి కాబట్టే… రాయలసీమలో కరవు సంభవిస్తే ఇంటింటికీ తిరిగి చందాలు అడిగి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నారని తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకున్నారని తెలిపారు.
ఇప్పుడు అమలయ్యే అనేక కార్యక్రమాలకు ఎన్టీఆరే నాంది పలికారని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. తెలుగు వారి ఆస్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల్లోనే మహాశక్తి దాక్కుని ఉందని ఈ సందర్భంగా వర్ణించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతామన్నారు. ఆయనకు ఆ అవార్డును ఇస్తే దేశానికే గౌరవం వస్తోందని తెలిపారు. ఈ నెల 28న ప్రతి ఇంట్లో ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు.
మా చంద్రబాబు నాయుడు గారికి .. ???? pic.twitter.com/JgsA9BUbWT
— TDP Germany (@TDP_Germany) May 21, 2023