తెలుగుదేశం పార్టీకి చెందిన అనుబంధ విభాగం అయిన ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి అమెరికా దేశంలో ఉద్యోగాలు కల్పించే ప్రోగ్రాంను చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోంది.
అందులో భాగంగా ఇరువురు హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ మరియు పెన్సిల్వేనియా రాష్ట్రాలలో (ఇంటర్నషిప్ ప్రోగ్రాం) ఉద్యోగాలు పొందారు.
ఈ ఇరువురు విద్యార్థులు తలారి సురేంద్ర కుమార్ ( కర్నూలు జిల్లా) షేక్ ఇంతియాజ్ మహ్మద్ ( అనంతపురం జిల్లా) పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గురువారం కర్నూలు జిల్లాలోని నంద్యాల క్యాంపు సైట్ వద్ద కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారికి జాబ్ ఆఫర్ లెటర్స్ అందచేసిన లోకేష్ వారిని అభినందించారు.
ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంపవర్మెంట్ సెంటర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వేదికగా మారిందని చెప్పారు.
వీరితో పాటు అక్క్కౌంట్స్ ట్యాలీలో శిక్షణ అనంతరం హైదరాబాద్ లోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం పొందిన మునిచంద్రను కూడా అభినందించారు.
గల్ఫ్ లో ఉపాధి పొందే నిమిత్తం నంద్యాలకు చెందిన మరి కొందరు విద్యార్థులు కూడా విజయవంతంగా శిక్షణ పొందారు.
టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ లో వారి శిక్షణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తామని విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ఛీఫ్ మెంటర్ వేమూరు రవికుమార్ , యుఎస్ కోఆర్డినేటర్ మల్లిక్ , ప్రముఖ ఆర్దోపెడిక్ సర్జన్ గరిమెళ్ళ రాజశేఖర్ పాల్గొన్నారు.