పవన్ కళ్యాణ్ వైసీపీకి వణుకు పుట్టిస్తున్నారు. పార్టీ విషయంలో ఇతరుల కామెంట్లకు, కోవర్టుల మాటలకు ప్రభావితం కాకుండా నడుచుకుంటున్నారు. టీడీపీ జనసేనలకు వైరం పెట్టేందుకు వైసీపీ విశ్వప్రయత్నం చేసినా లొంగిపోవడం లేదు.
ఎవరు ఎంత విమర్శించినా, ట్రోల్ చేసినా తన వ్యూహం ప్రకారమే పోతున్నారు. పొత్తు రాజకీయంలో తప్పు కాదు, వ్యూహం. పొత్తుల వల్లే చాలా పార్టీలు నిలబడ్డాయి. పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రావడం ఎన్టీఆర్ వల్ల అయిందేమో.. కానీ, నా వల్ల అవుతుందని నేను ఏనాడూ భావించలేదు. నినాదాలు చేస్తేనో.. గజ మాలలు వేస్తేనో.. సీఎం కాలేరు.. ఓట్లేస్తేనే సీఎం అవుతారు అనే విషయం అభిమానులు గమనించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
వైసీపీ నుంచి ఏపీని కాపాడటమే నా ప్రధాన లక్ష్యం. అరాచక పాలన నుంచి ఏపీని విముక్తి దొరికాక విముక్తి చేయడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని… వైసీపీ ఓడించడానికి ఎవరితో అయినా పొత్తుకు జనసేన సిద్ధంగా ఉందన్న విషయాన్ని పవన్ స్పష్టం చేశారు. నేను సీఎం అవడం ముఖ్యం కాదు, ఏపీని జగన్ నుంచి విడిపించడమే నా లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు.
అభిమానం ఓట్లుగా మారితేనే సీఎం అవుతారు.. అజాత శత్రువును కాను.. కొంత మందికి నన్ను శత్రువుగా చూసినా ఓకే.. నన్ను ఎంత విమర్శిస్తే.. అంతగా రాటుతేలుతా అని పవన్ కల్యాణ్ అన్నారు. ఎపుడూ అండగా నిలవని వారు సలహాలు ఇవ్వకండి. ప్రజల బాగు కోసం ఏది మంచి అయితే అదే చేస్తాను అని పవన్ స్పష్టం చేశారు.
To safeguard Andhra Pradesh, to take back power from @YSRCParty, and give back power to people through alliance – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/QhxS4VZgcp
— JanaSena Party (@JanaSenaParty) May 12, 2023