థాయ్ ల్యాండ్ క్యాసినో ఆడుతూ మనవాళ్ళు పట్టబుడ్డ వ్యవహారం గుర్తుందికదా. ఏషియా హోటల్లో జరిగిన గ్యాంబ్లింగ్ ను నిర్వాహకులు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారట. అంటే ఎక్కడో థాయ్ ల్యాండ్ హోటల్లో జరుగుతున్న క్యాసినోను హైదరాబాద్ లో కూర్చున్న కొందరు ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారట. అంటే క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని యావత్ ప్రపంచమంతా చూస్తుంది కదా. అలాగే క్యాసినోను కూడా చూపారట.
కాకపోతే క్రికెట్ మ్యాచులను ప్రపంచమంతా చూస్తుంది. ఇక్కడ క్యాసినోను కావాల్సిన వాళ్ళు మాత్రమే చూశారట. హోటల్లో క్యాసినో జరిగిన హాలుపై పోలీసులు దాడులు చేసినపుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న విషయాన్ని గమనించారు. లైవ్ స్ట్రీమింగ్ చేయటానికి అవసరమైన సాంకేతిక సరంజామా మొత్తాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అంటే హోటల్లో జరుగుతున్న క్యాసినోను చూస్తు హైదరాబాద్ లోని వాళ్ళు బెట్టింగులు కట్టడానికో లేకపోతే ఆన్ లైన్లో ఆడినట్లు ఆడటానికే ఏర్పాట్లు చేసుండాలి.
పై రెండుపద్దతుల్లో ఏదీ కాకపోతే అసలు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరమే లేదు నిర్వాహకులకు. గ్యాంబ్లింగ్ లేదా క్యాసినో అంటేనే అందరికీ గుర్తొకొచ్చే పేరు చికోటి ప్రవీణ్ మాత్రమే. అంతలా ప్రవీణ్ పాపులరైపోయాడు. అలాంటి చికోటి థాయ ల్యాండ్ హోటల్లో క్యాసినో జరుగుతున్నట్లే తెలీదంటున్నాడు. పోకర్ నిర్వహణ పేరుతో నిర్వాహకుల ఆహ్వానం అందుకున్న తర్వాత తాను థాయ్ ల్యాండ్ కు వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే హోటల్లో క్యాసినో జరుగుతున్నట్లు తెలిసిందట.
క్యాసినో జరుగుతున్న హోటల్ హాలులోకి ప్రవేసించిన పదినిముషాలకే పోలీసులు దాడులు చేసినట్లు చికోటి అమాయకంగా చెబుతున్నాడు. తనకు అసలు థాయ్ ల్యాండ్ చట్టాలు కూడా తెలీదట. అంటే థాయ్ ల్యాండ్ లో క్యాసినోలు నడపకూడదని తనకు తెలీదన్నట్లే అమయాకత్వం ప్రదర్శిస్తున్నాడు. ఏదేమైనా క్యాసినోలు నడపటంలో ఆరితేరిపోయిన చికోటి థాయ్ పోలీసులకు దొరకటమే సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రొఫెషనల్ గ్యాంబ్లర్ అయిన చికోటి మొదటిసారి విదేశాల్లో పట్టుబడినట్లున్నాడు. నేపాల్, శ్రీలంకలో పర్యటించినపుడు కూడా సమస్యలు ఎదురైనట్లులేదు. అందుకనే పట్టుబడగానే ఇపుడు అమాయకత్వం నటిస్తున్నాడు.
స్టాండ్ తీసుకోవాల్సి వొస్తే బీజేపీలో చేరుతా
: చికోటిhttps://t.co/9vI7Xua22I https://t.co/pLC7Nk5NEm— ???????????????????? ???????????????? (@Nallabalu1) May 1, 2023