జర్నలిస్టులు అంటే.. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ.. ప్రజలకు అండగా నిలుస్తారనే పేరు. అయితే.. ప్రజాస్వామ్య దేశాల్లోనే ఇప్పుడు కలానికి బలం తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది. వేదింపులు.. కేసులు నిత్యకృత్యంగా మారాయి. ఇక, కమ్యూనిస్టు చైనామాత్రం తక్కువ తిందా? గత రెండేళ్ల కిందట.. కోవిడ్ కేసులపై వార్తలు రాయడానికి వీల్లేదని.. అప్రకటిత ఆదేశాలు జారీ చేసి.. జర్నలిస్టుల కలాలకు తాళం వేసింది.
ఇలానే ప్రజాఉద్యమాలను కూడా చైనా
ఏం జరిగింది..
సూ యుటాంగ్.. ఓ పాత్రికేయురాలు. చైనాకు చెందిన ఈమె జర్మనీలో ఉంటున్నారు. 1989లో బీజింగ్‌లోని తియాన్మిన్ స్వ్కేర్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన చేపట్టారు. అయితే.. చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామికవాదులు ప్రపంచంలోని పలుచోట్ల ర్యాలీలు చేపడుతుంటారు. ఇందులో భాగంగానే జర్మనీలో జరిగిన ప్రదర్శనలో సూ యూటాంగ్ పాల్గొంది. అంతేకాదు.. పత్రికల్లో వ్యాసాలు కూడా రాసింది.
దీంతో చైనా ఏజెంట్లు ఆమెను టార్గెట్ చేసుకున్నారు. సూ యుటాంగ్ను సోషల్ మీడియాలో వేశ్యగా పేర్కొన్న చైనా ఏజెంట్లు ఆమె ఫోన్ నెంబర్, అడ్రస్‌ను ఆన్లైన్లో ఉంచారు. దీంతో ప్రతి రోజూ వందలాది మెసేజ్‌లతో పాటు పలువురు ఆమె ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నారు. ఈ వేధింపులు భరించలేకపోయిన ఆమె.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
“కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చి తలుపుకొడుతున్నారు. ఎవరని అడగ్గా ‘మీరు వేశ్య కదా.. ఆన్లైన్లో ప్రకటన ఉంది.. అందుకే వచ్చాం’ అని చెప్పడంతో తల కొట్టేసినంత పనైంది“ అని ఆమె వాపోయారు. ఆమె చిత్రాలను మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెట్టడంతో పాటు ఎస్కార్ట్ సర్వీసులు అందజేస్తున్నట్టు ఫోన్ నెంబర్లు ఇవ్వడంతో కొత్త వ్యక్తులు తరచుగా ఫోన్చేస్తున్నట్టు బాధితురాలు వాపోయారు.