దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మట్టికొట్టుకు పోయేలా చేస్తానని చెప్పిన ఆయనే మట్టిలో కలిశారన్నారు. టీడీపీ విజయవంతంగా 41 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. టీడీపీ ఎన్నో విజయాలు సాధించి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందన్నా రు. టీడీపీని తీసి పారేద్దాం అనుకున్న వాళ్లంతా కొట్టుకుపోయారని పరోక్షంగా దివంగత సీఎం వైఎస్ రాజ శేఖరరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫెడరల్ వ్యవస్థ ని టీడీపీ ఎప్పుడూ అవలంభిస్తుందన్నారు.
టీడీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్ర మాలు దేశానికే స్ఫూర్తిగా నిలిచాయని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. చట్టాలు చుట్టాలుగా మారకూడదు అనేది టీడీపీ సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గౌరవం పెంచింది టీడీపీయేనని పేర్కొన్నారు. టీడీపీ ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేశారని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. పదవులను వదిలిపెట్టి మరీ ప్రజలు కోసం టీడీపీ పని చేస్తుందన్నారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసుకునే అవకాశం దొరికిందని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిందన్నారు. నేరపూరిత రాజకీయం టీడీపీ ఎప్పుడు చేయలేదని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలు వైసీపీపై విసుగెత్తి పోయారనే విషయం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. ఒకే పార్టీ రాష్ట్రంలో ఉండాలి అనే మనస్తత్వం మార్చుకోవాలని సీఎం జగన్కు సూచించారు. పోలవరాన్ని అభివృద్ధి చేయడం మానేసి పనులు ఆపేశారన్నారు. హామీల కోసమే మోడీని జగన్ కలుస్తున్నారనేది నమ్మశక్యం గా ఉందా? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్పై ఒక విచారణ వేసి రిపోర్ట్ కూడా తెచ్చుకోలే ని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.