సైకిల్ మంచి జోరుమీదుంది. వరుసగా నాలుగు ఎంఎల్సీ స్ధానాల్లో గెలుపు నాయకత్వంతో పాటు క్యాడర్లో కూడా మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఊపును వచ్చే సాధారణ ఎన్నికలవరకు కంటిన్యు చేయాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో 28వ తేదీన పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. 29వ తేదీన రెండురాష్ట్రాల ప్రతినిధుల సభ ఘనంగా నిర్వహించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగిన ప్రతినిధుల సభ చాలా కీలకం. అందుకే ఘనంగా నిర్వహించారు. మే నెలలో నిర్వహించాల్సిన మహానాడును ఎన్నిరోజులు నిర్వహించాలి ? ఎక్కడ నిర్వహించాలి అనే నిర్ణయాలను ప్రతినిధుల సభలో తీసుకున్నారు.
ఎందుకంటే వచ్చేఎన్నికల్లోపు జరగబోయే మహానాడు కాబట్టి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
రెండు రోజుల సమావేశాల తర్వాత చంద్రబాబు ఏపీలో అన్నీ జిల్లాల్లో పర్యటించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని పార్టీపరంగా క్లస్టర్లు, జోన్లుగా డివైడ్ చేశారు. మహానాడు నిర్వహణ సమయానికి క్లస్టర్, జోన్లలోని కీలక నేతలతో సమావేశాలు పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మహానాడు తర్వాత క్లస్టర్లు, జోన్లలో రెగ్యులర్ గా పర్యటించబోతున్నారు.
ఎన్నికలు ఎప్పుడయినా రావచ్చు అన్న ఉద్దేశ్యంతోనే నేతలు, క్యాడర్లో చంద్రబాబు ఉత్సాహాన్ని నింపబోతున్నట్లు సమాచారం. నాలుగు ఎంఎల్సీ స్ధానాల్లో గెలుపు పార్టీలో ఆత్మస్ధైర్యాన్ని నింపిందనటంలో సందేహంలేదు. ఈ ఉత్సాహాన్ని ఎన్నికలవరకు మెయిన్ టైమ్ చేయటం ఎవరికైనా కష్టమే. అందుకనే రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు డిజైన్ చేస్తోంది. ఈ ఉత్సాహం నీరుగారిపోతే మళ్ళీ నేతలను జోష్ తేవాలంటే పార్టీ చాలా కష్టపడాల్సుంటుంది. అందుకనే అలాకాకుండా చంద్రబాబు ప్రణాళికలను వేస్తున్నారు.
సైకో పోవాలి..సైకిల్ రావాలి ????✌️???? pic.twitter.com/3TyXz9ZIBj
— Venu M Popuri (@Venu4TDP) March 23, 2023