తెలుగు వారికి నూతన సంవత్సరాది ప్రారంభమయ్యే చైత్య పాడ్యమిని పురస్కరించుకుని నిర్వహించుకు నే ఉగాది సంబరాలు.. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగాయి.
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను బాటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
దాదాపు 2000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్(CG SFO India Consulate), అమెరికా చట్ట సభల సభ్యుడు రో ఖన్నా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఉగాది పచ్చడి పంపిణీతో నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర సంబరాలు ప్రారంభ మయ్యాయి.
అనంతరం.. యువతకు టాలెంట్ షో నిర్వహించారు.
దీని తర్వాత.. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
అదేవిధంగా దాదాపు 400లకు పైగా చిన్నారులకు వివిధ ప్రత్యేక హాల్స్‌లో పోటీలు నిర్వహించారు.
కర్ణాకట, జానపద, సినీ గీతాలు, నృత్యాలు, ప్రత్యేక అభిరుచులలో పోటీలు నిర్వహించారు.
ఇదేసమయంలో ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
అదేవిధంగా నగలు, దుస్తుల బజార్‌ను నిర్వహించారు.
ప్రధాన సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది.
విజయ ఆసూరి(బాటా సలహాదారు) అతిథులకు ఆహ్వానం పలికారు.
అనంతరం సుమారు 100 మందికి పైగా చిన్నారులు వివిధ నృత్యాలతో అతిథులను మంత్రముగ్దులను చేశారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ..
+ దొరకునా ఇటువంటి సేవ ( కళాతపస్వి విశ్వనాథ్ కు నృత్య నివాళి)
+ తారలు దిగి వచ్చిన వేళ – (సినీ తారల స్మృతులు)
+ రాధికా-కృష్ణ ( కృష్ణ లీలా సమ్మోహనం )
+ నాకూ ఫీలింగ్స్ ఉంటే (సంగీత సమ్మోహనం)
కార్యక్రమంలో భాగస్వామ్యమైన బాటా కమిటీ సభ్యులు..
+ ఎగ్జిక్యూటివ్ కమిటీ: హరినాథ్ చీకోటి (అధ్యక్షుడు), కొండల్ రావు (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి, శివ కడ & వరుణ్ ముక్కా
+ స్టీరింగ్ కమిటీ: రవి తిరువీదుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి & సుమంత్ పుసులూరి.
+ కల్చరల్ కమిటీ: శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి & కిరణ్ విన్నకోట.
+ లాజిస్టిక్స్ టీమ్: హరి సన్నిధి, సురేష్ శివపురం & శరత్ బాబు.
+ యూత్ కమిటీ: సంకేత్, ఉదయ్, ఆదిత్య, సందీప్, గౌతమి & హరీష్
+ కళ & డిజైన్ కమిటీ: కళ్యాణి చికోటి, దీప్తి కోటరీ, స్రవంతి కరకాల, నవీన పాలేటి, & కృష్ణ మంగిన
+ BATA “సలహా బోర్డు” జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ & కళ్యాణ్ కట్టమూరి టీమ్‌ని అభినందించారు.
+ హరినాథ్, కొత్త చొరవ “ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు (PVSA)” గురించి వివరాలను అందించారు. (ఇది వాలంటీర్లను గుర్తించడానికి వైట్ హౌస్ రూపొందించిన జాతీయ అవార్డు సేవలు).
2023-2025 కొత్త BATA ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇదే..
+ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కొండల్రావు కొమరగిరి BATA బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
జట్టు సభ్యులందరితో కలిసి పని చేస్తానని పేర్కొన్నారు.
+ BATA కమిటీ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
మీడియా పార్టనర్ గా వ్యవహరించిన నమస్తే ఆంధ్ర కి ధన్యవాదాలు తెలిపారు
+ తానా కమిటీ సభ్యులు సతీష్ వేమూరి(కార్యదర్శి), రామ్ తోట తదితరులు రాబోయే తానా సదస్సు వివరాలను తెలియజేశారు.
ఈవెంట్‌ను BATA కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
ముగింపు వేడుకలను కూడా అంతే సుందరంగా తీర్చిదిద్దారు.
ముగింపు వేడుకల్లో నృత్యాలు, ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఆస్కార్ సాంగ్ “నాటు నాటు“కు యువత డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహ పరిచింది.
BATA ఉగాది మహోత్సవం అద్భుతమైన విజయాన్ని సాధించింది, ఇది తెలుగు సంప్రదాయాన్ని ప్రస్పుటీకరించింది.
సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలను తర్వాతి తరానికి అందించే ప్రయత్నం చేసింది.
బాటా అధ్యక్షులు హరినాథ్ చికోటి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మీడియా పార్టనర్ గా వ్యవహరించిన నమస్తే ఆంధ్ర కి ధన్యవాదాలు తెలిపారు
ఈ ఈవెంట్‌ను (WWW.BATA.ORG)లో వీక్షించవచ్చు.
ఈ కార్యక్రమానికి సంజయ్ టాక్స్ ప్రో ప్రధాన స్పాన్సర్(గ్రాండ్ స్పాన్సర్)గా వ్యవహరించారు.
అదేవిధగా నాగరాజ్ అన్నియ్య, ఏఎంపీ: శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్(గోల్డ్ స్పాన్సర్)గా వ్యవహించారు.
ఇక, ఇతర స్పాన్సర్లు.. ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్జీ జ్యువెల్లర్స్, రిటే కేర్, టెక్సా. ఏఐ, సాగర్ కొత్త(రియల్టర్), పాఠశాల(తెలుగు స్కూల్), వీజెన్ ఇండియా ప్రొపర్టీస్.. కార్యక్రమానికి సహకారం అందించారు.