ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి.
వైసీపీని కి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడింది. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేశం లేదు.
టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఊహించని విధంగా అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపు ???????? దెబ్బ అదుర్స్ కదూ @YSRCParty ? pic.twitter.com/LrL9FUaNBn
— iTDP Official (@iTDP_Official) March 23, 2023
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా!!#MLCElectionsInAP
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) March 23, 2023