దేశ ప్రధానమంత్రి.. రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ముఖ్యనేతలు రోడ్లమీద ప్రయాణించే వేళలో.. వారి కాన్వాయ్ కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా రోడ్ల మీద వాహనాలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా సదరు వీవీఐపీలు రావటానికి పదిహేను నుంచి అరగంట ముందు రోడ్ల మీద ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి పరిస్థితిని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు.
అందుకు భిన్నంగా గాల్లో ఎగురుకుంటూ వచ్చే హెలికాఫ్టర్ లో సభాస్థలి వద్దకు నేరుగా చేరుకునే వీలున్న చోట.. సదరు సభ జరిగే ఊరు.. దానికి వచ్చే రోడ్డు మార్గం మొత్తానికి ట్రాఫిక్ ఆంక్షల్ని విధించే తీరును ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? అలాంటి సిత్రవిచిత్ర నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఏపీ.
తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారంటూ పోలీసులు ఇబ్రహీంపట్నం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
జగదల్ పుర్ నేషనల్ హైవే పైన ఇబ్రహీంపట్నం నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల పాటు.. అంటే ఏకంగా ఎనిమిది గంటల పాటు నేషనల్ హైవే మీద నడిచే వాహనాల దారి మళ్లిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంగా తిరువూరుకు అరగంటలో చేరుకునే దూరానికి దాదాపు రెండు గంటల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. అలవాటైన వారికి మారిన రూట్లను అర్థం చేసుకొని వెళ్లగలరు కానీ.. అదే కొత్త వారికి అయితే మాత్రం చుక్కలే.
ఇంత హడావుడి చేసిన తర్వాత ముఖ్యమంత్రి మాత్రం హెలికాఫ్టర్ లో సభాస్థలి వద్దకు చేరటం ఆశ్చర్యపోయేలా చేసింది. నేషనల్ హైవే మీద ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు విధించిన వేళ.. ముఖ్యమంత్రి ఆ రహదారి మీద కేవలం అరగంట మాత్రమే ఉండటం గమనార్హం. ఇంత హడావుడి చేసి.. ఇంత స్వల్ప వ్యవధిలో సాగే కార్యక్రమానికి గంటల కొద్దీ ముందే.. ట్రాఫిక్ ఆంక్షలు విధించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఒక ప్రోగ్రాంలో పాల్గొనేందుకు బయటకు వస్తే.. అందుకు గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులకు గురి కావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
జగన్ పనైపోయింది !! #ByeByeJaganIn2024 pic.twitter.com/ecYptFCKed
— iTDP Official (@iTDP_Official) March 19, 2023