రాజకీయాల్లో ఎప్పుడు ఒకరికే కలిసిరావు..పరిస్తితులకు తగ్గట్టుగా మారిపోతాయి. ఒకసారి గెలిచి తమకు తిరుగులేదని భావిస్తే..ఎప్పటికైనా దెబ్బతినక తప్పదు..ఇంకా తమదే విజయం అని అనుకోవడం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నాం కదా అని..ఇంకా శాశ్వతంగా అధికారం తమదే అని అనుకుంటే రిస్క్ తప్పదు. ఇప్పుడు అధికార వైసీపీలో చాలామంది నేతలు అలాగే భావిస్తున్నారు. ఏదో శాశ్వతంగా అధికారం, గెలుపు తమదే అనే భావనలో ఉన్నారు.
అలాంటి వారికి ప్రజలు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలా ప్రజల షాక్ ఎదురుకోబోతున్న వారిలో మంత్రి విడదల రజిని కూడా ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు వరకు రజినికి రాజకీయాలు అంటే పెద్దగా పరిచయం లేదు. ఏదో ఎన్ఆర్ఐగా వచ్చి..టిడిపిలో చేరి..అప్పుడు మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఫాలోవర్‌గా ముందుకు సాగారు. కానీ సడన్ గా ఆమెకు సీటు కోసం చూశారు..ఇదే క్రమంలో వైసీపీ ఆఫర్ ఇచ్చింది. వెంటనే వైసీపీలోకి వెళ్ళిపోయారు.
ఇక అప్పటివరకూ వైసీపీ సీనియర్ గా ఉన్న మర్రి రాజశేఖర్‌ని సైతం పక్కన పెట్టి ఆర్ధికంగా బలంగా ఉన్న రజినికి సీటు ఇచ్చారు. జగన్ గాలిలో రజిని.. ప్రత్తిపాటిపై గెలిచారు. గెలిచిన తర్వాత నుంచి సీన్ మారిపోయింది..ఆమె గెలుపుకు సపోర్ట్ చేసిన మర్రినే సైడ్ చేసేశారు. అటు ఎంపీ శ్రీకృష్ణకు సైతం చెక్ పెట్టాలని చూశారు. పైగా మంత్రి పదవి దక్కడంతో ఎక్కడా కూడా తగ్గట్లేదు. విచిత్రం ఏంటంటే తన కోసం సీటు త్యాగం చేసిన మర్రికి జగన్ మంత్రి పదవి ఇస్తానంటే.. ఆయనకు కాకుండా రజనీయే మంత్రి పదవి సాధించేశారు.
అయితే మంత్రిగా తన శాఖపై పట్టు తక్కువ..నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ..సోషల్ మీడియాలో హడావిడి ఎక్కువ. దీంతో ఆమెపై నెగిటివ్ పెరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో చిలకలూరిపేటలో ఆమెకు గెలుపు అవకాశాలు లేవని తాజా సర్వేలో తేలిపోయింది. పేటలో ప్రత్తిపాటి గెలుపు ఖాయమైంది. ఇక రజినికి సొంత పార్టీ నేతలైన మర్రి, శ్రీకృష్ణ మద్ధతు ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో రజిని రెండోసారి గెలిచే ఛాన్స్ అసలు కనిపించడం లేదు.
విడదల రజని
2017
రాక్షసుడు ఎలా ఉంటాడని చిన్నపిల్లలు అడిగితే ప్రతిపక్షనేత (YS జగన్) ను చూపించండి
మన లోకేష్ అన్నయ్య విశ్వవీధుల్లో దొరకని సమర్థమైన నేత
Best CM CBN ,ఇచ్చాపురం to తడ దాకా ఆయన అభివృద్ధి ఉంటుంది. CBN సైబరాబాద్‌లో పెట్టిన చెట్టు ముక్క నేను2018
YSRCP join2019
జగన్ అన్న pic.twitter.com/JDYYqP3xWo— Eclector (@eclector1419857) December 22, 2020