తమ్ముడు తనవాడైనా ధర్మమే చెబుతానన్నాడు..ధర్మరాజు. అందుకే మహాభారతం జరిగిందా.. జరగలే దా.. అనే దానితో సంబంధం లేకుండా నేటికీ ధర్మరాజు పేరు నిలిచిపోయింది. రాజ్యాంగాన్ని కాపాల్సిన వ్యవస్థ గా ఉన్న అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు .. తాజాగా చేసిన వ్యాఖ్య… దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సరే.. తాజాగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఇది కూడా ఓకే. కోర్టు తన తీర్పు.. ఆదేశాలు.. ఎలా గైనా ఇవ్వొచ్చు. కానీ, ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన ఒకే ఒక్క కామెంట్ ప్రజాస్వామ్య వాదలను నివ్వె ర పోయేలా చేసింది. అదే.. “సీబీఐని మేం నియంత్రించలేం“ అని! ఇది.. ఒక్క తెలంగాణ కేసును ఉద్దేశించే సుప్రీం కోర్టు అని ఉండొచ్చు.
కానీ, స్వతంత్ర వ్యవస్థగా అక్రమార్కుల గుండెల్లో నిద్రపోవాల్సిన సీబీఐ.. రాజకీయ నేతల ప్రమేయంతో.. కొందరు ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలబొమ్మగా మారిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో దీనిని గాడిలో పెట్టాల్సిన.. సరిదిద్దాల్సిన.. సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ పరిరక్షక వ్యవస్థే.. “మేం నియంత్రిం చలేం“ అంటే.. సీబీఐకి, దానిని తెరవెనుక ఉండి నడిపిస్తున్నవారికి మరిన్ని కొమ్ములురావా? మున్ముం దు.. చెలరేగిపోవా?! అన్నదే ప్రశ్న.
ఇక, రెండో విషయం.. ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి పేరుతో ఉన్న సిమెంట్ కంపెనీ కేసు. జగన్ అక్రమాస్తుల కేసులో ఈ భారతి సిమెంట్ కేసు కూడా ఉంది. ఈ క్రమంలోనే సీబీఐ, ఈడీలు.. దాదాపు 250 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. దీనిని సిమెంట్ సంస్థ కోర్టులకు వెళ్లి విడిపించుకుంది. దీనికి గాను పూచీ కత్తుగా 25 కోట్లు సమర్పించింది. దీనిని ఈడీ సవాల్ చేసింది.
ఈ కేసుపై ఇప్పటికే టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో రావాల్సి ఉందని.. కానీ, జగన్ తన ఎంపీ నిరంజన్ రెడ్డి ద్వారా అనుకూలమైన బెంచ్‌పై ఈ కేసు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని.. టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే.. సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామం.. ఆశ్చర్యకరంగా ఉంది.
ఏం జరిగింది..?
భారతీ సిమెంట్స్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. హఠాత్తుగా జాబితా నుంచి మాయమైంది. భారతీ సిమెంట్స్ కేసును న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణ్యన్, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జాబితాలో రిజిస్ట్రీ చేసింది. 16 వ నంబర్ కేసుగా జాబితాలో రిజిస్ట్రీ అయ్యింది. అయితే.. 15వ నంబర్ కేసును విచారించిన తరువాత 16 వ నంబర్ కేసు వినాలి. కానీ, ధర్మాసనం నేరుగా 17 వ నెంబర్ కేసును విచారించింది. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.