మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-2 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే స్ట్రీమ్ అయిన అన్ని ఎపిసోడ్ లకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా…అదే ఊపుతో చివరి ఎపిసోడ్ ను కూడా ముగించాలని బాలయ్య ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ కు టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే ఆల్రెడీ స్ట్రీమ్ అయిన తొలి ఎపిసోడ్ రికార్డు వ్యూస్ సాధించి ట్రెండ్ అవుతోంది.
తొలి ఎపిసోడ్ లో పవన్ వ్యక్తిగత జీవితం, 3 పెళ్లిళ్లు, సినిమాలు వంటి వాటిపై బాలయ్య ప్రశ్నలు సంధించారు. దీంతో, రెండో ఎపిసోడ్ లో పొలిటికల్ ప్రశ్నలుంటాయని అంతా భావించారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్ మొత్తం రాజకీయ ప్రశ్నలతో రచ్చ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల పవన్ ఇప్పటంలో కారు టాప్ పై కూర్చుని ప్రయాణించడంపై బాలయ్య ప్రశ్నించారు.
దానికి పవన్ తనదైన రీతిలో సమాధానమిచ్చారు. చాలారోజుల తర్వాత తనకు తిక్క వచ్చిందని…గబ్బర్ సింగ్ తరహాలో పవన్ ఆన్సర్ ఇచ్చారు. విశాఖలో గదిలో నుంచి బయటకు రావొద్దన్నారని, ఇప్పటంలో కారులో వెళ్లొద్దన్నారని, ఇలా ప్రతి దానికి ఆంక్షలు విధిస్తుండడంతో తిక్కలేచి అలా కారుపైకి ఎక్కి కూర్చున్నానని చెప్పారు. ప్రజాసేవ చేసేందుకు సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది…? పార్టీ పెట్టే బదులు టీడీపీలో చేరొచ్చు కదా? అని పవన్ ను బాలయ్య షాకింగ్ క్వశ్చన్ అడిగారు.
పవన్ పై ఉన్న అభిమానం ఓట్ల రూపంలోకి ఎందుకు మారడంలేదని బాలయ్య ప్రశ్నించారు. ఇక, ఈ ఎపిసోడ్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా హాజరై సందడి చేశారు. పవన్ సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాలవైపు రావడంపై ఈ షోలో నిర్వహించిన ఓటింగ్ పై క్రిష్ కూడా ప్రేక్షకుల మధ్య కూర్చొని ఓటేశారు. ఏది ఏమైనా ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఈ గ్రాండ్ ఫినాలే ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.