రీల్ స్టోరీకి ఏ మాత్రం తగ్గనన్ని ట్విస్టులు ఈ రియల్ స్టోరీలో కనిపిస్తాయి. కేరళకు చెందిన ఈ వింత కథ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారి ఒక ట్రాన్స్ మన్ బిడ్డకు తల్లి కాబోతున్నారు. అంతేనా.. అంతకు మించి చాలానే ఉన్న ఈ రియల్ స్టోరీకి వేదికగా మారింది కేరళ. పుట్టుకతో మగవాడైన జియా లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాలని డిసైడ్ అయ్యాడు. అమ్మాయిగా పుట్టిన జహద్ లింగమార్పిడితో అబ్బాయిగా మారాలని అనుకుంది.
పుట్టుకతో అమ్మాయి కాకున్నా తనకు పుట్టే బిడ్డకు అమ్మగా అనిపించుకోవాలనే కోరిక ఉండేది. జియాకు తండ్రిగా అనిపించుకోవాలన్న ఆశ ఉండేది. వీరి ఆశలను వాస్తవంలోకి తీసుకొచ్చేందుకు సైన్స్ సాయం చేస్తోంది. సెక్స్ రీఎసైన్ మెంచ్ సర్జరీ లో భాగంగా లింగ మార్పిడి చేయించుకోవాలిన జియా.. జహద్ అనుకున్నప్పటికీ అనూహ్యంగా జహద్ గర్భం దాల్చటంతో వారి లింగమార్పిడి కార్యక్రమాన్ని ఆపేశారు. దీంతో.. దేశంలో గర్భం దాల్చిన తొలి ట్రాన్స్ మన్ గా జహద్ వార్తల్లోకి వచ్చారు.
నిజానికి తాము సెక్సు మార్పిడి సర్జరీ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరన్నకారణంగా.. ఎవరైనా బిడ్డను దత్తత తీసుకోవాలని భావించారు. అయితే.. అదంత తేలికైన విషయం కాదన్న విషయం వారికి అర్థమైంది. ఇదే సమయంలో బయలాజికల్ గా జహద్ ఇంకా అమ్మాయే కావటంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో వారు.. ఆ దిశగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అయితే.. లింగమార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా జహద్ తన వక్షోజాలను ఇప్పటికే తొలగించుకోవటంతో పుట్టబోయే పసికందుకు దాతల సాయంతో పాలు అందించాలని భావిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి డెలివరీకి ఎలాంటి ఇబ్బందులు కలగవని వైద్యులు చెబుతున్నారు.