సిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఉత్తరప్రదేశ్. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాష్ట్రంలో నేరాలకు.. ఘోరాలకు.. చిత్ర విచిత్రమైన ఉదంతాలకు అస్సలు కొదవ ఉండదు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లా ఛపియా ఉమ్రావ్ గ్రామంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
కైలాశ్ యాదవ్ అనే వ్యక్తికి అక్షరాల 70 ఏళ్లు. అతనికి పన్నెండేళ్ల క్రితం భార్య చనిపోయింది. అతనికి నలుగురు కొడుకులు. వారంతా వేర్వేరు చోట్ల ఉంటారు. అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. ఇదిలా ఉంటే.. కొన్నేళ్ల క్రితం మూడో కొడుకు చనిపోయాడు. అతడి భార్య పూజ ఒంటరిగా ఉండిపోయింది.
మధ్యలో ఏమైందో ఏమో కానీ.. తాజాగా ఈ ముసలి తాత.. తన కోడలు పూజను పెళ్లాడి ఇంటికి తీసుకొచ్చాడు.దీంతో.. వీరి వివాహం ఊళ్లో సిత్రంగా మారటమే కాదు.. చుట్టుపక్కల ఉన్న వారంతా సిత్రంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.దీంతో.. ఈ వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా స్థానికంగా ఉండే గుడికి కోడలు పూజను తీసుకెళ్లిన కైలాస్.. ఆమె నుదిట మీద సింధూరం దిద్దాడు. తర్వాత పూలదండలు మార్చుకోవటం ద్వారా పెళ్లి ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.