హమనుంతుడి ముందు కుప్పిగంతులా అన్న సామెత ఇపుడు జగన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంబంధం లేని ఒక పనికిమాలిన ఆరోపణ చేసి … అది కూడా 30 కేసులు, అందులో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్న వ్యక్తి న్యాయవ్యవస్థకే ప్రశ్నగా మారిన వ్యక్తి అవినీతి చేశాడని ఆరోపణలు చేస్తే ఈ దేశం నమ్ముతుందా? ఈ ప్రజలు నమ్ముతారా? ఏం జరగాలో అదే జరిగింది.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే లేఖ రాశారు. ఆయన వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆయనను కోరింది. దానికి అనుగుణంగా బోబ్డే లేఖ రాశారు. దీంతో ఎన్వీ రమణ నియామకం ఇక లాంఛనమే.
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మోస్ట్ సీనియర్ జడ్జి. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే 2022, ఆగస్టు 26 వరకు కొనసాగుతారు. అంచెలంచెలుగా ఎదిగి చిరస్మరణీయమైన పదవిని చేరుకుంటున్న తరుణంలో ఒక గాలి ఆరోపణ చేసి తప్పిద్దామని … జగన్ విఫలయత్నం చేశారు.
ఇక పోతే ఎన్వీ రమణ 1957, ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని ఓ వ్యవసాయం కుటుంబంలో జన్మించారు. 2000, జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితుడయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్వీ రమణ 48వ సీజేఐ.
Chief Justice of India (CJI) SA Bobde (file photo) sends a letter to Central government recommending to appoint senior most Supreme Court Judge Justice NV Ramana as the next CJI.
CJI SA Bobde is due to retire on April 23. pic.twitter.com/VfhkSOKL5z
— ANI (@ANI) March 24, 2021